రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ని మర్యాదపూర్వకంగా ఈ రోజు కలిశారు. ఆయనతో పాటు జనసేన పార్టీ రాజమండ్రి ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నగర పాలక సంస్థ ఎస్ఈ పాండు రంగారావు, ఈఈతో సమావేశమై రాజమహేంద్రవరం నగర అభివృద్ధి విషయమై చర్చించారు.
Read Moreకోడెలకు ఓ న్యాయం, జగన్ కు మరో న్యాయమా?
– కోడెలకు ఓ న్యాయం, జగన్కు మరో న్యాయమా? – తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి అమరావతి: స్పీకర్ గా నాడు తాను వాడుకున్న ఫర్నిచర్ తీసుకెళ్లామని కోడెల కోరితే, ఆయన్ని దొంగ అన్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు ఫర్నిచర్ వాడుకున్న జగన్ ను ఎమనాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫర్నిచర్ తీసుకెళ్లండి కోడెల శాసనసభ కు రాసిన లేఖ కూడా ఉందని గుర్తుచేశారు. […]
Read Moreపాపం.. లచ్చమ్మ ఫీలయిందట!
– తొలి ఫైలుపై సంతకానికి మంత్రి నారాయణ నో – చిన్నబుచ్చుకున్న ఏఐఎస్ అధికారి శ్రీలక్ష్మి – ఫలించని ఓవర్ యాక్షన్ – ఆమెకు ఫైళ్లు పంపవద్దని సర్కారు ఆదేశం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఆమె ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. నిబంధనల ప్రకారం పనిచేస్తే కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ వరకూ వెళ్లేంత రాజయోగం. కాలం ఖర్మం కలసివస్తే.. జగన్నయ్య మళ్లీ సీఎం అయి ఉంటే ఆమె చీఫ్ సెక్రటరీ […]
Read Moreఅసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షనేత ఎవరు?
– అసెంబ్లీలో జగన్ సీటెక్కడ? – ప్రధాన ప్రతిపక్ష హోదా లేని వైనం – 22 స్థానాలతో జనసేన – 11మంది ఎమ్మెల్యేల వైసీపీకి సీటెక్కడ కేటాయిస్తారు? – ఫ్లోర్‌లీడర్‌గా జగన్‌కు మొదటి వరస ఉంటుందా? – జగన్‌కు మాట్లాడే అవకాశం ఉంటుందా? – 19 తర్వాత అసెంబ్లీ సమావేశాలు? – అందరి చూపూ అసెంబ్లీ వైపే? ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీ అసెంబ్లీ సమావేశాల కోసం యావత్ తెలుగు […]
Read Moreటీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసయాదవ్
– ఉత్తర్వులిచ్చిన పార్టీ అధినేత బాబు – ముందే చెప్పిన ‘మహానాడు’ టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసయాదవ్ నియమితులయ్యారు. ఆ మేరకు పార్టీ అధినేత-సీఎం చంద్రబాబునాయుడు ఉత్తర్వు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పల్లా శ్రీనివాసయాదవ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. కాగా నిన్నటి వరకూ పార్టీ అధ్యక్షుడిగా కృషి చేసిన అచ్చెన్నాయుడు సేవలను చంద్రబాబు అభినందించారు. ఇదిలాఉండగా.. పల్లాకు […]
Read Moreమూడు వారాల్లో అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ
పురపాలక – పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతి, జూన్ 16 : నిరుపేదలకు కేవలం రూ.5/- లకే ఉదయం టిఫిను, రూ.5/- లకే మద్యాహ్న భోజనం మరియు రూ.5/- లకే రాత్రికి భోజనం అందజేసే అన్నా క్యాంటీన్లను మూడు వారాల్లో పునరుద్దరిస్తామని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రిగా పొంగూరు నారాయణ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఆదివారం ఉదయం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే అన్నా […]
Read Moreముస్లింలకు జగన్మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ముస్లిం సోదర సోదరీమణులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్‌రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగనిరతికి, ధర్మబద్ధతకి, దాతృత్వానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకుంటారన్నారు. పేద, ధనిక తారతమ్యాలు లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారన్నారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ అభిలషించారు.
Read Moreచీనాబ్ రైల్వే బ్రిడ్జీపై ట్రయల్ రన్ విజయవంతం
జమ్మూలోని చీనాబ్ నదిపై నిర్మించిన అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ వంతెనపై నిర్వహించిన ట్రయిల్ రన్ విజయవంతమైనట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ట్రైన్ ఇంజన్ ను టెస్ట్ చేయగా విజయవంతంగా అది రియాసి స్టేషన్ కు చేరుకుందని తెలిపారు. దీంతో త్వరలోనే రాంబన్ జిల్లాలోని సంగల్దాన్ నుంచి రియాసి మధ్య త్వరలో సేవలు ప్రారంభం కానున్నాయి.
Read Moreటీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన జే. శ్యామలరావు
టీటీడీ కార్యనిర్వహణాధికారిగా జే. శ్యామలరావు ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నుండి బాధ్యతలు స్వీకరించారు. నూతన ఈవో తన సతీమణితో కలిసి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి వేదాశీర్వచనం చేశారు. ఆ తర్వాత జేఈఓ వీరబ్రహ్మం ఈవోకు శ్రీవారి ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. కాగా, తిరుమల క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుగా శ్రీ వరాహ […]
Read More19వ తేదీన పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ నెల 19వ తేదీ, బుధవారం నాడు పదవి బాధ్యతలను స్వీకరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను పవన్ కళ్యాణ్ కి కేటాయించిన సంగతి విదితమే. పవన్ కళ్యాణ్ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్న శాఖలను కేటాయించడంతో పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
Read More