కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయట్లేదు?

-ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరం -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ కుంభకోణాలు, నేరాల్లో మరో అతిపెద్దది ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం. ఇది దేశానికే మాయని మచ్చ. కేసీఆర్‌ కుటుంబం, వారి సన్నిహిత పోలీసు అధికారుల బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్నే కుదిపేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న […]

Read More

సజ్జల పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

-వ్యవస్థలు ఎలా భ్రష్టుపట్టాయో మాచర్లే ఉదాహరణ -ప్రజల మద్దతుతో కూటమి అధికారంలోకి రాబోతోంది -వైసీపీ నేతలు ఏ కలుగులో దాక్కున్నా వదలం -చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదు -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి: సజ్జల రామకృష్ణారెడ్డి జూన్‌ 5న పెట్టాల్సిన ప్రెస్‌ మీట్‌ ఈరోజే పెట్టి బోరున విలపిస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ […]

Read More

వారణాసిలో ఈటెల బృందం ప్రచారం

వారణాసి, మహానాడు: తెలంగాణకు చెందిన ఈటల రాజేందర్‌ బృందం వారణాసిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్‌, చాడ సురేష్‌రెడ్డి, ధన్పాల్‌ సూర్యనారాయణ, తిరుపతి యాదవ్‌, గంగాధర్‌ గౌడ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. సోనార్పూర్‌లో వారణాసి తెలుగు బ్రాహ్మణ సంఘం వారితో సమావేశమయ్యారు. మోదీకి ఓటు వేయాలని కోరారు.

Read More

జగన్‌ పై రాయి దాడి నిందితుడికి బెయిల్‌

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కు షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తూ జిల్లా కోర్టు మంగళవరం తీర్పు చెప్పింది. పోలీసు విచారణకు సతీష్‌ సహకరించాలని పేర్కొంది. ఏప్రిల్‌ 13న బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో పర్యటిస్తున్న సమయంలో జగన్‌పై రాయి దాడి చేశాడన్న కారణంతో ఏప్రిల్‌ 18న సతీష్‌ను అరెస్టు చేశారు.

Read More

పిన్నెల్లికి బెయిల్‌ మంజూరు

అమరావతి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం వివిధ కేసులలో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన ప్రతిరోజూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావు పేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్‌ నెంబర్‌ పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్టు కోర్టులో సరెండర్‌ చేయాలని ఆదేశించింది.

Read More

వారం తర్వాత రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ విరగడ ఖాయం

–  ఎన్నికల కమిషన్‌ అంపైర్‌ లాగా వ్యవహరించలేదు – చంద్రబాబు వైరస్‌తో ఎన్నికల కమిషన్‌ ఇన్‌ఫెక్ట్‌ అయింది – మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు – మా పార్టీకి అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్‌ అడిగాం – వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకే కేంద్రంతో పొత్తులు – సీఎస్‌ జవహర్‌ రెడ్డిని తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు – పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా…? – ఈవీఎంలలో […]

Read More

కోడలి మూర్ఖత్వంతో అనాథలా మామ మృతి

-ఇంటి తాళం లేక రోడ్డుపైనే శవం -స్థానికుల సహకారంతో అంత్యక్రియలు తిరుపతి, మహానాడు: కోడలి మూర్ఖత్వంతో మామ అనాథలా మృతిచెందిన ఘటన తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమలలో గత 50 సంవత్సరాలుగా జీవిస్తున్న శ్రీనివాసులు రెడ్డి, గురమ్మ అనే దంపతులకు ఒక కుమారుడు. తన పేరు మీద ఉన్న ఆస్తిని కుమారుడి పేరు మీద రాసి శేష జీవితం సాఫీగా గడుపుదామని అనుకున్నారు. ఇంతలో విధి ఆడిన నాటకంలో కుమారుడు అనారోగ్యంతో […]

Read More

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి: చిరంజీవి

అమరావతి: ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా చిరంజీవి ట్వీట్‌ చేశారు. కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నంద మూరి తారక రామారావును ఈ రోజు గుర్తుచేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Read More

విద్యార్థులకు షూలు, రెండు జతల సాక్స్‌లు

-జూన్‌ 12 నాటికి స్కూల్‌ కిట్లు అందించాలి -పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ విజయవాడ: జూన్‌ 5వ తేదీ నాటికి అన్ని షూల(బూట్లు) రవాణా పూర్తి చేయా లని, జూన్‌ 12వ తేదీ నాటికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున స్కూల్‌ కిట్‌ అందేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ ఆదేశించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకునే వారికి నల్ల […]

Read More

కాంగ్రెస్‌ పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు

ఇండియా కూటమి వస్తే ఇంటి పెద్ద ఖాతాలో డబ్బు పంజాబ్‌ ఎన్నికల ప్రచారంలో భట్టివిక్రమార్క పంజాబ్‌: కాంగ్రెస్‌ తన 55 ఏళ్ల పరిపాలనలో ఏనాడు పూజా కార్యక్రమాలను అడ్డుకోలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పంజాబ్‌ రాష్ట్రంలోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిం చారు. సభకు ముందు ప్రధాన అతిథిగా విచ్చేసిన […]

Read More