పోలీసు తనిఖీల్లో బంగారం, నగదు స్వాధీనం

ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ ప్లాజా వద్ద పోలీసు తనిఖీల్లో ఒక కారులో అక్రమంగా తరలిస్తున్న కిలో 250 గ్రాముల బంగారం, రూ.58 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 90 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మేడిశెట్టి మల్లేష్‌, అతని భార్య చంద్రకళ చెన్నై నుంచి బంగారాన్ని అక్రమంగా తీసుకువెళుతుండగా స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సొత్తును […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి ఎదురుదెబ్బ

-సీల్‌, హోదా లేకపోయినా చెల్లుతుందని స్పష్టం -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈసీ లేఖ అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల వ్యవహారంలో వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో వైసీపీ అభ్యంతరాలపై ఘాటుగా సమాధా నమిచ్చింది. డిక్లరేషన్‌పై గెజిటెడ్‌ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్‌, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందని స్పష్టం చేసింది. అటువంటి పోస్టల్‌ బ్యాలెట్లను అనుమతించాలని రిటర్నింగ్‌ అధికారికి ఆదేశాలు జారీ […]

Read More

జవహర్ రెడ్డి.. కింకర్తవ్యం ?

-ఏబీవీకి హైకోర్టులో ఊరట – క్యాట్ ఆర్డర్ను సమర్ధించిన హైకోర్టు – ఒక్కరోజులో రిటైరయ్యే ఏబీ సాక్షులను ఏం ప్రభావితం చేస్తారు? – ఏబీ కేసులో జగన్ సర్కారుకు షాక్ – సీఎసు మళ్లీ దరఖాస్తు ఇచ్చిన ఏబీవీ – సీఎస్ కోర్టులో మళ్లీ ఏబీ బంతి – జగన్ వైపు ఉంటారా? ధర్మం వైపు నిలుస్తారా? -కోర్టు చెప్పినా పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వని అధికారిగా అపకీర్తి తెచ్చుకుంటారా ? […]

Read More

కౌంటింగ్‌ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే…

-ఎటువంటి విజయోత్సవాలకు అనుమతి లేదు -రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా మచిలీపట్నం: కౌంటింగ్‌ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా హెచ్చరించారు. మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో గురువారం ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎన్నిక ల అధికారి బాలాజీ, ఇతర అధికారులకు కొన్ని సూచనలు చేశారు. కౌంటింగ్‌ పరిసర ప్రాంతాల్లో […]

Read More

కేసీఆర్‌ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర

-తెలంగాణ ప్రజల ఆగ్రహానికి బలికాక తప్పదు -కాంగ్రెస్‌తో బీజేపీ కుమ్మక్కై మాట్లాడటం లేదు -రాజముద్ర తొలగింపుపై ఓవైసీ స్పందించాలి -బీఆర్‌ఎస్‌ నేత జి.దేవీప్రసాద్‌ హైదరాబాద్‌: కేసీఆర్‌ హయాంలో పదేళ్ల పాటు జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్‌ విధ్వంసంగా చూపెట్టే ప్రయత్నం చేస్తోంది…కేసీఆర్‌ ఆనవాళ్లను కాంగ్రెస్‌ చెరిపేసే ప్రయత్నం చేస్తే ఉద్యమ ఆగ్రహానికి బలికాక తప్పుదని బీఆర్‌ఎస్‌ నేత జి.దేవీ ప్రసాద్‌ హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. […]

Read More

సకల శాఖల మంత్రి సజ్జలను ఎన్నికల సంఘం అరెస్టు చేయాలి

-అన్నం తింటున్నాడా… గడ్డి తింటున్నాడా..బుద్ధుందా? -జగన్‌రెడ్డి, జవహర్‌రెడ్డి డైరెక్షన్‌లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు -ఓటమి భయంతో పోలింగ్‌ రోజున రాష్ట్రంలో అలజడులకు వైసీపీ కుట్రలు -రిటర్నింగ్‌ అధికారులను కూడా బెదిరిస్తున్నారు -ఓటమి ఖాయమవడంతో లండన్‌లో జగన్‌ రెడ్డి టీవీలు బద్దలుకొడుతున్నాడు -టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి: ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న సకలశాఖల మంత్రి సజ్జలను తక్షణమే ఎన్నికల సంఘం అరెస్ట్‌ చేయాలని మాజీ మంత్రి దేవినేని […]

Read More

తెలంగాణ రాజముద్రను మార్పు చేయొద్దు

-కాకతీయ కళాతోరణం, చార్మినార్‌లను తొలగించొద్దు -తెలంగాణా ఉద్యమకారుడు, కార్మిక నేత పినపాక ప్రభాకర్‌ హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వ రాజముద్ర నుంచి కాకతీయుల కళాతోరణం, చార్మినార్లను తీసివేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదని, ఆ రెండు చిహ్నాలను అందులో ఉంచాలని తెలంగాణ ఉద్యమకారుడు, షాద్‌ నగర్‌ కార్మిక నేత పినపాక ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. గొప్ప చరిత్ర ఉన్న చిహ్నం కళాతోరణం అని, ఒకప్పుడు వరంగల్‌ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు ఈ ప్రాంతం […]

Read More

తెలంగాణ నూతన అధికారిక చిహ్నం!

హైదరాబాద్‌: తెలంగాణ నూతన అధికారిక చిహ్నం రూపకల్పన పూర్తయినట్లు తెలిసింది. చిహ్నంలో అమరవీరుల స్థూపం, మూడు రంగుల జెండా, వ్యవసాయం ప్రతిబింబించేలా వరి వంగడాలు, జాతీయ చిహ్నం(సింహాలు, అశోకచక్రం) ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు భాషలలో రాసి ఉంది. దీనిని అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదని తెలుస్తుంది. చిహ్నం మార్పుపై ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శల నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో దీనిని ఆవిష్కరిస్తారో […]

Read More

కౌంటింగ్‌ రోజు సజ్జల ఆటలు సాగవు

-దోచుకోవడమే సీఎస్‌ జవహర్‌రెడ్డి పని -బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు విజయవాడ: బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సీఎస్‌ జవహర్‌రెడ్డి పాపాలు క్షమించరాని విధంగా తన ప్రవర్తన ఉంటుంది. భూములు, మైనింగ్‌ ఇలా అన్ని దోచుకోవటమే పని. రాష్ట్రంలో రాబోయేది కూటమి ప్రభుత్వమే సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్‌ రోజు దొంగ ఓట్లు వేయటానికి వేసిన వ్యూహనికి ఎన్నికల కమిషన్‌ చెక్‌ […]

Read More

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులకు జీతాలు చెల్లించాలి

ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌: నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మూడునెలల పెండిరగ్‌ జీతాలు చెల్లించాలని ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు కోరారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం మూడునెలలుగా వారికి జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని తెలిపారు. అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంట ర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ తదితర 78 విభాగాలలో పనిచేస్తున్న 17,541 […]

Read More