కారంచేడు, మహానాడు: రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త, సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన బాపట్ల జిల్లా, కారంచేడులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని, మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానని తెలిపారు. కోట్లు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని […]
Read More‘హిందూ బోర్డు’ కోసం గతంలోనే గళం విప్పా!
– కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ధార్మిక సంస్థ లేదు – పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కొనసాగింపుగా టీడీపీ, జనసేన ఎంపీలంతా గళాన్ని వినిపించాలి – సుప్రీం కోర్టులో విజయ్ పాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు – ఒక అప్పియరెన్స్ కు రూ. 30 లక్షలఫీజు తీసుకున్న న్యాయవాది మను సింఘ్వి – నేనొక రాజకీయ నాయకుడిని కావడం వల్లే నిబంధనల ప్రకారం కేసు విచారణ… అందుకే ఆలస్యం […]
Read Moreతెలంగాణ భవన్‌లో సంబురంగా బతుకమ్మ పండుగ
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ పాటలను పాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. మహిళలతో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిలు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను పండుగను జరుపుకున్నారు. మహిళల బతుకమ్మ పాటలతో తెలంగాణ భవన్‌లో కోలాహలంగా మారింది.
Read Moreఅవును ఆయన వయస్సు 188
బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటికి తీసుకువచ్చారు. అతడి వయసు 188 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఆ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కు చెందిన సియారామ్ బాబా అని తెలిసింది. ఆయన వయసు 188 ఏళ్లు ఉంటాయని అంచనా. ఆయన రామ భక్తుడు అని, 10 ఏళ్ల పాటు […]
Read Moreపవన్ ఆర్‌ఎస్‌ఎస్ అజెండాని మోస్తేత ప్రజల హర్షించరు
`సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో అన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చి ఉపముఖ్యమంత్రి అయిన తరువాత సనాతన ధర్మం గురించి మాట్లాడం, రాజకీయంగా నష్టం […]
Read Moreఎన్డీయే సర్కారు పాలనలో ఆర్టీసీకి మంచిరోజులు!
– కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల సారథ్యంలో సంస్థ బలోపేతం • ‘మహిళలకు ఉచిత బస్సు’ అమలుకు ప్రభుత్వం సమాయత్తం – రాష్ట్ర మైన్స్ జియాలజీ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వ పాలనలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని.. కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల నారాయణరావు సారథ్యంలో ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర మైన్స్ జియాలజీ, ఎక్సైజ్ […]
Read Moreఏపీ మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ
మంగళగిరి, మహానాడు: మంగళగిరి పట్టణంలోని ఐ.హెచ్.సి కార్పొరేట్ భవనం రెండో అంతస్తులో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్యాలయంలో శనివారం మారిటైమ్ బోర్డు ఛైర్మన్ గా దామచర్ల సత్యనారాయణ(సత్య) బాధ్యతలు స్వీకరించారు. మొదటిగా కుటుంబ సభ్యులతో పూజలు నిర్వహించి, మధ్యాహ్నం 12:36 నిమిషాలకు అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. రోడ్లు, భవనాలు,పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల […]
Read Moreసాహిత్యానికి భారతీయ సంస్కృతిలో సమున్నత స్థానం!
– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఏలూరు, మహానాడు: సాహిత్యానికి భారతీయ సంస్కృతిలో సమున్నత స్థానం ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం ఏలూరు పట్టణంలోని రామకృష్ణాపురంలో సాహిత్య మండలి, కేవీఎస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో సాహిత్య మండలి, పుల్లాభోట్ల శ్రీరామమూర్తి ప్రాంగణంలో అంబికా రామచంద్రరావు – అనసూయమ్మ సాహిత్య వేదికపై శరన్నవరాత్రుల సాహిత్య ఉత్సవం-కేవీ సత్యనారాయణ సాహిత్య పురస్కార సభ జరిగింది. ముఖ్యఅతిథిగా మాజీ ఉప […]
Read Moreసుప్రీంకోర్టు మీద నమ్మకం లేని వ్యక్తి జగన్!
– ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శ సాతులూరు, మహానాడు: దేవుడి మీదే కాదు… దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుపై కూడా నమ్మకం, గౌరవం లేని రీతిలో జగన్ ప్రవర్తిస్తున్న తీరు విచిత్రం ఉందని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు స్వతం త్ర దర్యాప్తునకు ఆదేశించి… ఏర్పాటు చేస్తామన్న ప్రత్యేక సిట్‌పైనా జగన్ రెడ్డి, అతడి బ్లూ మీడియా, […]
Read Moreఉచిత ఇసుకపై సాగుతున్న అసత్య ప్రచారంపై సీఎం సీరియస్
– కఠిన చర్యలకు వెనుకాడవద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు ఆదేశాలు ఉచిత ఇసుక విధానంపై సామాజిక మాధ్యమం వేదికగా జరుగుతున్న అసత్య ప్రచారం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ప్రభుత్వం పూర్తి ఉచితంగా పారదర్శక విధానంలో రాష్ట్ర ప్రజలకు ఇసుకను అందిస్తున్నప్పటికీ, ప్రజలను తప్పుదారి పట్టించేలా జరుగుతున్న సామాజిక మాధ్యమ ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర […]
Read More