టీడీపీలోకి మోపిదేవి?

అమరావతి: మాజీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటికే తన కార్యకర్తలు, అభిమానులు, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలతో సమావేశం అయ్యారు. ఈ నెల తొమ్మిదోతేదీన సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మోపిదేవి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందంటున్నారు.

Read More

పట్టభద్రుల ఎన్నికల ప్రచారం

– కరపత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: పట్టణంలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, ప్రతి ఒక్కరికి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లలను కూడా కలిశారు. పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఓట్లు నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో క నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Read More

కాకాణి… ఒక అనకొండ!

– కోర్టులో ఫైళ్లు లేపేసిన గజదొంగ గోవర్ధన్ రెడ్డి – డాక్యుమెంట్ల ముఠాలకు, మద్యం మాఫియాకు లీడర్ – ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ ఆరోపణ నెల్లూరు, మహానాడు: కొండలను మింగిన అనకొండ కాకాణి… కోర్టులో ఫైళ్లు లేపేసిన గజదొంగ గోవర్ధన్ రెడ్డి… నకిలీ డాక్యుమెంట్ల ముఠాలకు, కల్తీ మద్యం మాఫియాకు లీడర్ కూడా ఆయనే… వైసీపీ హయాంలో ఆయన తవ్విన గ్రావెల్ గుంతలను సోమిరెడ్డికి […]

Read More

లోన్ వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్!

ముంబయి: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన కస్టమర్‌ లకు షాకిచ్చింది.. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ట్ లెండింగ్ రేటు(ఎంసీఎల్‌ఆర్‌) పెంచుతున్నట్టు ఆ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. సవరించిన లోన్ వడ్డీ రేట్లు ఈనెల ఏడోతేదీ నుంచే అమలు లోకి వస్తాయని తెలిపింది. ఆరు నెలల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును, మూడేళ్ల టెన్యూర్ ఎంసీఎల్ఆర్ రేటును అయిదు బేసిస్ పాయింట్ల మేర పెంచినట్టు వెల్లడించింది. మిగితా టెన్యూర్ ఎంసీఎల్‌ఆర్‌ రేటును యథాతథం […]

Read More

ప్రధాని మోదీతో సీఎం బాబు భేటీ

ఢిల్లీ: రెండు రోజుల హస్తిన పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు , ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 1.30 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లిన చంద్రబాబు,ఢిల్లీ చేరుకొని నేరుగా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అమరావతి, పోలవరం నిధులు, రాష్ట్రంలో వివిధ రహదారుల అభివృద్ధి, రైల్వేజోన్‌ శంకుస్థాపన, సెయిల్‌లో విశాఖ స్టీల్‌ విలీనం, ఇటీవల సంభవించిన వరద బాధితులను ఆదుకొనేందుకు కేంద్రం నుంచి […]

Read More

మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు

– యడ్లపాడులో గ్రీవెన్స్ నిర్వహించిన ప్రత్తిపాటి యడ్లపాడు, మహానాడు: ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు వారం వారం మండలాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలు నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రతివారం ఒక మండలంలో ఈ వేదిక నిర్వహించి ఎక్కడి సమస్యలకు అక్కడే పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామన్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశా లతో పాటు రెవిన్యూ సమస్య ల […]

Read More

మున్సిపాలటీ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష

అద్దంకి: మున్సిపాలిటీ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మంచి నీటి సరఫరా, రహదారులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్య సమస్యలపై దృష్టి పెట్టాలని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులకు సూచించారు. పట్టణ వీధుల్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా శుభ్రం చేయాలని తెలిపారు. […]

Read More

25 వేల కేజీల డ్రగ్స్ కేసు ఏమైంది?

– సీబీఐ,పోలీసులు, ఇంటర్ పోల్ చేసిన ఆపరేషన్ రిజల్ట్ ఏది? – మార్చి నెల నుండి ఇప్పటివరకు విశాఖ పోర్టుకు వచ్చిన డ్రగ్స్ కంటైనర్ కేసును ఎందుకు బయటపెట్టడం లేదు? – ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ విశాఖ: రాష్ట్రంలో ఇసుక ఇబ్బందుల వల్ల దాదాపుగా 26 సెక్టార్లకు సంబంధించిన వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక 370 రూపాయలు సీనరేజీ, వంద రూపాయలు హ్యాండిల్ చార్జెస్ […]

Read More

ధర్మవరం రూపురేఖలు మార్చే హ్యాండ్లూమ్ క్లస్టర్

– ఏర్పాటుకు సత్వర చర్యలు – కేంద్రానికి ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వినతి అమరావతి : శతాబ్దాలుగా చేనేత రంగానికి ముఖ్యంగా పట్టు చీరెల ఉత్పత్తికి ప్రసిద్ధి గాంచిన శ్రీ స‌త్య‌సాయి జిల్లాలోని త‌న స్వంత నియోజ‌క‌వ‌ర్గం ధర్మవరంలో “హ్యాండ్లూమ్ క్లస్టర్” ఏర్పాటుకు సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర జౌళి, చేనేత శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక లేఖలో […]

Read More

జానీ మధ్యంతర బెయిల్ రద్దు చేయండి

– పోలీసుల పిటిషన్ రంగారెడ్డి: టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది, మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని పోలీసులు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. జాతీయ అవార్డు అందుకోవడం కోసం రంగారెడ్డి కోర్టు మంజూరు చేసిన 4 రోజుల మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేయనున్నారు. ఈ నెల 10వ తేదీన కోర్టులో హాజరుకావాలని జానీ మాస్టర్‌ను రంగారెడ్డి కోర్టు ఆదేశించింది. అయితే జానీ […]

Read More