కమిషనర్‌పై స్టేషన్‌లో ఫిర్యాదు నంద్యాల: గత ప్రభుత్వ హయాంలో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణ లపై సమాచార శాఖ కమిషనర్ విజయ్‌కుమార్ రెడ్డిపై నంద్యాల టూటౌన్ పోలీసుస్టేషన్లో సీనియర్ పాత్రికేయుడు చలం బాబు ఫిర్యాదు చేశారు. సీఐ రాజారెడ్డి ఫిర్యాదును స్వీకరించారు. ఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లి కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు.
Read Moreసంఘ్ కార్యకర్త నుంచి కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం
హైదరాబాద్: కేంద్రమంత్రిగా మరోసారి ఎంపికైన కిషన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం చూస్తే సంఘ్ కార్యకర్త అయిన కిషన్‌రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేశారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009, 2014లో అంబర్‌పేట నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఎంపీగా గెలిచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2021లో కేబినెట్ విస్తరణలో […]
Read Moreతెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం
బండి సంజయ్‌కు మంత్రి పదవి సామాన్యుడికి భరోసా కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాలు అసామాన్యం ప్రజాసంగ్రామ యాత్రతో కేసీఆర్ సర్కార్‌పై ఉద్యమాలు బండి రాజకీయ జీవిత ప్రస్థానమంతా ఒడిదుడుకులే ఎమ్మెల్యేగా ఓడిరచినా వీడని హిందుత్వ వాదం నమ్మిన సిద్ధాంతం కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం కార్యకర్తల పిలుపు కోసం పరితపించే అభిమానధనుడు హిందుత్వ ఐకాన్‌కు కేంద్రమంత్రి పదవిపై సంబరాలు కార్యకర్తల్లో ఉప్పొంగుతున్న ఉత్సాహం […]
Read Moreలారీలో 70 టన్నుల బూడిద పడుతుందా?
పొన్నర్‌పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు పాడి కౌశిక్‌రెడ్డి దుష్ప్రచారం సిగ్గుచేటు ఆరోపణలను నిరూపిస్తే దేనికైనా సిద్ధం ఉద్యమ నాయకుడిపై ఉద్యమ ద్రోహి అక్కసు రవాణా మంత్రిగా ఆయన సేవలు అద్వితీయం ఎస్సీ సెల్ మాజీ జాయింట్ కన్వీనర్ దొంత రమేష్ హైదరాబాద్: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని టీపీసీసీ ఎస్సీ సెల్ మాజీ జాయింట్ […]
Read Moreఅన్న ఎన్టీఆర్‌ను టచ్ చేస్తే తీవ్ర పరిణామాలు
గుంటూరులో స్టేడియం పేరు మార్పు శిలాఫలకాల కూల్చివేత ఎన్టీఆర్ జిమ్‌గా నామకరణం చేసిన బ్రాహ్మణ చైతన్య వేదిక పాల్గొన్న వాకింగ్ ట్రాక్ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు అమరావతి: ఎవరైనా అన్న ఎన్టీఆర్‌ను టచ్ చేయాలని చూస్తే తీవ్ర పరిణా మాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌శర్మ హెచ్చరించారు. నగరం నడిబొడ్డున బృందా వన్ గార్డెన్స్‌లో ఎన్టీఆర్ స్టేడియం పేరు మార్చాలని వైసీపీ […]
Read Moreరామోజీకి కడసారి వీడ్కోలు: చంద్రబాబు
హైదరాబాద్: రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు. తెలుగు వెలుగు, అక్షర యోధుని అంతిమ సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నాను. తెలుగువారి ఆత్మబంధువు రామోజీ గారికి కడసారి వీడ్కోలు పలికాను. హృదయం బాధతో నిండిపోయింది. ఈనాడు ఆయన మన మధ్య లేకపోయినా..ఆ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తి మార్గదర్శిగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఉషాకిరణాల్లాంటి ఆయన కీర్తి అనునిత్యం అజరామరమై […]
Read Moreఅక్షర ప్రపంచాన్ని శాసించిన రారాజు
అస్తమించిన అక్షర సూరీడు! ‘ఈనాడు’ రామోజీ మహాభిష్క్రమణం తెలుగు జర్నలిజాన్ని కొత్తమార్గం పట్టించిన మీడియా మొఘల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) ‘మీడియాతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్’.. రాజకీయవర్గాల్లో ఈ భావన – భయం జమిలిగా జనించేందుకు కారకులైన ఈనాడు అధినేత రామోజీరావు ఇక లేరు. శనివారం తెల్లవారుఝామున అక్షరాకాశంలో అంతర్ధానమయ్యారు. తెలుగునేల నలుచెరుగులా వెదజల్లిన అక్షరమొక్కలను శ్వాసిసూ, శాసిస్తూ ఇక సెలవంటూ వెళ్లిపోయారు. అక్షర సామ్రాజ్యంలో సంపూర్ణ విజయాలను సాధించిన […]
Read Moreజగన్ ప్రత్యర్థి జగనే!
( మార్తి సుబ్రహ్మణ్యం) మనిషికి శత్రువు మనిషే. జగన్‌కు శత్రువు జగనే! ఈ ఐదేళ్ల కాలంలో జగన్ నైజం అనుభవించిన ఆంధ్రా ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ పతనాన్ని శాసించింది జనం అనుకుంటే పొరపాటు. చంద్రబాబు ఓడించారనుకుంటే మహా పొరపాటు. తన పతనాన్ని తానే శాసించుకున్నారాయన. అలాంటి అవకాశం జగన్ జనాలకు ఇవ్వదలచుకోలేదని ఫలితాలే స్పష్టం చేశాయి. మూర్తీభవించిన అహంకారం, నిలువెల్లా నియంత్రృత్వం, సర్వజనులూ తనకు సాగిలబడాలన్న […]
Read Moreటీటీడీలో చాలా లెక్కలు తేలాల్సి ఉంది
-టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్ పోర్ట్ సీజ్ -పారిపోకుండా లుక్ అవుట్ నోటీసులు ఇవ్వండి -తిరుమల టోల్ గేట్ వద్ద నిఘా పెట్టండి -జనసేన నేత కిరణ్ రాయల్ డిమాండ్ తిరుపతి: టి.టి.డి. ఈఓ ధర్మారెడ్డి పాస్ పోర్ట్ ను వెంటనే సీజ్ చేయాలని, తిరుమల తిరుపతి దేవస్థానములు ఈఓ గా గత ఐదు సంవత్సరాలుగా ఎలాంటి అర్హత లేకపోయినా, ఐ.ఏ.ఎస్. కాకపోయినా, గత అధికార పార్టీ అండదండలతో తి.తి.దే. […]
Read Moreరామోజీ మరణం కలిచివేసింది: మహేష్‌బాబు
హైదరాబాద్: రామోజీరావు మృతి పట్ల సూపర్ స్టార్ మహేష్‌బాబు సంతాపం తెలిపారు. దూరదృష్టి ఉన్న రామోజీరావు మరణవార్త తెలిసి చాలా బాధపడ్డా. రామోజీ ఫిలిం సిటీ సినిమాపై ఆయనకున్న అభిరుచికి నిదర్శనం. ఆయన వారసత్వం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.
Read More