కొడాలి నాని ఇంటి దగ్గర ఉద్రిక్తత

తెలుగుయువత ఆధ్వర్యంలో ఆందోళన రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్‌ రాళ్లు, కోడి గుడ్లతో దాడికి యత్నం అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం సహనం కోల్పోయిన సీఐ.. కాల్చేసుకుందామని ఆగ్రహం గుడివాడ: ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానంటూ ప్రకటించిన నాని మాట నిలబెట్టుకోవాలంటూ తెలుగు యువత నాయకులు కొడాలి నాని ఇంటి దగ్గర పెద్దఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత శ్రేణులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఒకానొక […]

Read More

జవహర్ రెడ్డికి ఆర్జిత సెలవు మంజూరు

అమరావతి,7 జూన్:మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డికి ఈనెల 7వ తేదీ నుండి 27వ తేదీ వరకూ అనగా 21 రోజుల పాటు ఆర్జిత సెలవు మంజూరు చేస్తూ సాధారణ పరిపాలన శాఖ జిఓఆర్టీ సంఖ్య 1058 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్జిత సెలవు మంజూరు చేయాల్సిందిగా గురువారం ప్రభుత్వానికి దరఖాస్తు చేసిన నేపధ్యంలో ఆమేరకు […]

Read More

పాపం.. కాంగ్రెస్

-కాంగ్రెస్ పరువు కాపాడిన కడప, అరకు -50 వేల ఓట్లు కూడా తెచ్చుకోలేని కొప్పుల రాజు, శీలం, గిడుగు, పల్లంరాజు (అన్వేష్) సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కాస్తంత మెరుస్తుందని భావించిన కాంగ్రెస్‌వాదుల ఆశలు ఆవిరయ్యాయి. కడపలో షర్మిల, అరకులో అప్పల నరస మాత్రమే పరువు కాపాడారు. ఢిల్లీలో అధిష్టానం వద్ద పెద్ద పేరున్న కేంద్ర మాజీ మంత్రులు కనీసం 50 వేల ఓట్లు కూడా సాధించలేకపోయారంటే, వారికి […]

Read More

50 టన్నుల నుంచి 70 టన్నుల చేపలు దిగుమతి

-తెలుగు రాష్ట్రాల్లో మృగశిర కార్తె -భారీగా చేపల విక్రయా హైదరాబాద్: మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యం సిద్దిస్తుందని కొందరు నమ్ముతారు. డిమాండ్‌ నేపథ్యంలో వ్యాపారులు పెద్ద ఎత్తున చేపలను దిగుమతి చేస్తారు. నగరం లోనే అతి పెద్దదైన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కు మృగశిర కార్తెకు ఒక రోజు ముందే గురువారం చేపలు పెద్ద ఎత్తున దిగుమతి అయ్యాయి. సాధారణ రోజుల్లో మార్కెట్‌ లో 15 టన్నుల […]

Read More

కూటమి సునామీకి కారణాలివే

– గెలుపునకు దోహదపడ్డ హామీలు (పులగం సురేష్) ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే సాదాసీదాగా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోలేదు. 151 సీట్లు సాధించిన వైఎస్ఆర్సీపీని మట్టికరిపించేలా అంతకు మించిన ఫలితాలతో విజయదుందుభి మోగించింది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గానూ 164 స్థానాల్లో విజయం సాధించింది. ఇక ఎంపీల విషయానికొస్తే మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు గానూ 21 స్థానాలను కైవసం చేసుకుంది. […]

Read More

నిజాలు చేదుగా ఉంటాయి..

యుద్ధం ముగిసింది ..అర్జునుడు హుందాగా కూర్చోగా రథం నగరానికి వచ్చింది… కృష్ణుడు అర్జునుడిని ఓరకంట చూస్తూ ” దిగు పార్ధా” అన్నాడు. పార్థుడు మొహం చిట్లించాడు ..చికాకుపడ్డాడు.. ఆనవాయితి ప్రకారం ముందుగా సారథి దిగి రథం యొక్క తలుపు తీసాక వీరుడు దిగుతాడు…….. దానికి విరుద్ధంగా ముందు సారథి దిగకుండా తనను దిగమనడంతో అర్జునుడి అహం అడ్డు అయింది… ఐనా ఆ మహనుభావుడిని ఏమీ అనలేక… అర్జునుడు రథం దిగుతాడు. […]

Read More

జగన్ భజనపరుడు ముద్దాడ రవిచంద్ర

-ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చింది ఆయనే -అలాంటి ఐఏఎస్-ఐపిఎస్‌లకు కీలక బాధ్యతలు వద్దు ఐఏఎస్ ముద్దాడ రవిచంద్రకు సీఎంఓలో కీలక బాధ్యత అప్పగించడంపై సీఎం చంద్రబాబునాయుడుతో కలసి ఎస్వీ యూనివర్శిటీలో చదివిన సామాజిక ఉద్యమకారుడు, వామపక్ష నేత టి.లక్ష్మీనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముద్దాడ మాజీ సీఎం జగన్ భక్తుడని, తెలుగు వారి హృదయాలను గాయపరిచిన ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు మార్చింది ఆయనేనని గుర్తు చేశారు. ఆ […]

Read More

అసలు విశ్వగురువు ఎవరు?

విశ్వగురువుకు విరిగె వెన్నెముక… ప్రాంతీయ గురువుల ఊత కర్రలే శరణ్యమాయెఇక…. చరిత్ర ముందుకాళ్ళతో ఎన్నడూ వెనుకకు నడవదని తెలుసుకో నాయక…… జగత్ గురువులైన… చరిత్ర నిర్మాతలైనా.. ఎవరు…..? ఎవరు……? మరెవరు…? మరి……. ప్రజా సమూహాలు కాక! ️ – సిహెచ్. సుధాకరరావు సాహితీ స్రవంతి. నెల్లూరు.

Read More

ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది: YS జగన్

  ఏపీలో రాజ్యాంగ వ్యవస్థలు కూలిపోయాయని జగన్ ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చింది. వైసీపీ నేతలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారు. గత ఐదేళ్లలో సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీశారు. 3 రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా’ అని తెలిపారు.

Read More

ప్రజల్లో గెలిచా…మీ అభిమానం మరువను

ఎల్లవేళలా అందుబాటులో ఉంటా దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి దర్శి: ఎన్నికలు ముగిశాక తొలిసారిగా దర్శికి వచ్చిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ప్రజానీకం అపూర్వ స్వాగతం పలికారు. ఆమె నివాసం దగ్గర మధ్యా హ్నం నుంచే కోలాహలం నెలకొంది. తరలివచ్చిన ప్రజానీకం మాట్లాడుతూ మా బిడ్డగా ఆదరిస్తాం.. నియోజకవర్గంలోనే ఉండి చంద్రబాబు నాయకత్వంలో దర్శి అభివృద్ధికి పాటుపడండి…మేము ముందుండి నడిపిస్తామని లక్ష్మికి మాటిచ్చా రు. ఈ సందర్భంగా […]

Read More