టీడీపీ అభ్యర్థిపై వైసీపీ ఫిర్యాదు

సచివాలయం, వెలగపూడి, మహానాడు : డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధమన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను పార్టీ నాయకులు మల్లాది విష్ణు, గ్రీవెన్స్‌ సెల్‌ చైర్మన్‌ నారాయణమూర్తి అందచేశారు.

Read More

బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ వెయ్యి రెట్లు బెటర్‌

వ్యవసాయం, ధాన్యం సేకరణలో ముందున్నాం ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు బోనస్‌ ఇస్తాం పేదోళ్లు కూడా సన్నబియ్యం తినాలన్నదే తమ ఉద్దేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం వచ్చే ఎన్నికల నాటికి హామీలన్నీ పూర్తిచేస్తాం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, ధాన్యం సేకరణలో వెయ్యి రెట్లు మేలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. […]

Read More

ఈవీఎమ్ ను బద్దలు కొట్టినా చర్యలు లేవు

-పోలింగ్ తర్వాత పిన్నెల్లి నాయకత్వంలో అల్లర్లు, అరాచకాలకు అంతు లేదు -ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డ పిన్నెల్లి బ్రదర్స్ – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. పోలింగ్ జరిగిన నాటి నుండి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన […]

Read More

పిన్నెల్లిపై పోలీసు కేసు

అజ్ఞాతంలోకి గాయపడ్డ శేషగిరిరావు మాచర్ల : పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలంలోని పాల్వాయ్ గేట్ లో ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రం లో ఈవిఎం ను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై పోలిసులు కేసు నమోదు చేశారు ఈ నెల 13 న ఎమ్యెల్యే పిన్నెల్లి తన అనుచరులతో పోలింగ్ బూత్ నెంబరు 202 ను ధ్వంసం చేయగా అక్కడే ఉన్న టీడీపీ […]

Read More

చంద్రబాబును ఓడించడం వైసిపి తరం కాదు

* ఎనిమిదవ సారి గెలుపు ఖాయం * సిఎం పదవి చేపట్టడం తథ్యం – టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ బి సుధాకర్ రెడ్డి ధీమా చిత్తూరు, మే 22 : కుప్పంలో చంద్రబాబును ఓడించడం వైసిపి నేతల తరం కాదని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి సవాలు విసిరారు. ఆ మేరకు ఆయన చిత్తూరులో మీడియాకు వీడియో విడుదల చేసారు. […]

Read More

జన్మభూమికి బ్రేక్‌ పడింది

ప్రయాణీకులకు ఆ మూడుగంటలు నరకమే విశాఖపట్నం: ట్రైన్‌ బోగీ లింక్‌ కట్‌ అవ్వడంతో జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ ప్రెస్‌ మూడుగంటలుగా నిలిచిపోయింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్‌ కట్స్‌ దగ్గర్ద ఏసీ బోగీ లింక్‌ తెగిపోయి ఆగింది. దీంతో అధికారులు ట్రైన్‌ను వెనక్కి తీసుకొచ్చి స్టేషన్‌లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్‌ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు.

Read More

ఐదు నెలల కాంగ్రెస్‌ పాలన నిరాశాజనకం

హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి బోనస్‌పై మంత్రులు పూటకో మాట చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పనితీరు మాత్రం పూర్తి నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారింది. సీఎం రేవంత్‌ మంత్రులకు దేని మీద స్పష్టత లేదు. తలో […]

Read More

బీసీ డిక్లరేషన్‌ ఏమైంది రేవంత్‌?

-లక్ష కోట్ల బడ్జెట్‌ అమలు చేస్తున్నారా? -రిజర్వేషన్లను 55 శాతానికి పెంచుతారా? -సివిల్‌ కాంట్రాక్టులు, వైన్స్‌లో రిజర్వేషన్లు ఇస్తున్నారా? -బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు ప్రశ్నలు హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ నేత గట్టు రామచంద్రరావు బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ బీసీల కిచ్చిన హామీలు తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. కామారెడ్డిలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను కాంగ్రెస్‌ పార్టీ మరచిపోయిందన్నారు. స్థానిక […]

Read More

ధాన్యం మొలకెత్తుతున్నా కొనరా?

తరుగు పేరుతో మరో మోసమా? మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం కొనుగోలు కేంద్రం సందర్శన సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ తుఫాన్‌ ప్రభావంతో వచ్చే మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు. చిన్నకోడూరు […]

Read More

రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు

విజయవాడ :  బెంగుళూరు రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసుది విజయవాడ కాగా క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడని చెబుతున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాలతో సంబంధం ఉందని అంటున్నారు. క్రికెట్‌ బుకీ వ్యవస్థ నడిపిస్తూ ఇటీవల వాసు గ్యాంగ్‌ ఖరీదైన స్థలాలు కొన్నట్లు సమాచారం. బెంగుళూరులో రేవ్‌ పార్టీకి వాసు అండ్‌ టీమ్‌ కూడా పనిచేసినట్లు గుర్తించారు.

Read More