స్విమ్స్‌ నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్‌

-గన్‌మెన్‌ ధరణికి పరామర్శ -వారు లేకుంటే ప్రాణాలు పోయేవని వ్యాఖ్య -మంచిపద్దతి కాదని చెవిరెడ్డికి హితవు తిరుపతి, మహానాడు: వైసీపీ మూకల దాడిలో గాయపడి తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని గురువారం డిశ్చార్జ్‌ అయ్యారు. చంద్రగిరిలో ఉన్న గన్‌మెన్‌ ధరణి ఇంటికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గన్‌మెన్‌, […]

Read More

మాజీ ఎంపీ కొనకళ్లకు గుండెపోటు

పరామర్శించిన టీడీపీ నాయకులు మచిలీపట్నం/విజయవాడ, మహానాడు: బందరు మాజీ ఎంపీ, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు గురువారం తెల్లవారుజామున గుండెపోటుకు గురయ్యారు. ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు విజయవాడలోని రమేష్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర విభజన సమయంలో ఢిల్లీలోని పార్లమెంటులో మొదటిసారిగా గుండెపోటు వచ్చింది. ఇది రెండోసారి. రమేష్‌ ఆసుపత్రిలో కోలుకుంటున్న […]

Read More

హెచ్‌ 1బీ వీసాదారులకు భారీ ఉపశమనం

అమెరికా, మహానాడు: ఉద్యోగం కోల్పోయిన హెచ్‌ 1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరి కొంతకాలం అమెరికాలో ఉండేం దుకు అవకాశాన్ని పొందనున్నారు. ఇందుకోసం అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) నూతన నిబంధనలను విడుదల చేసింది. తమ తాజా చర్యతో హెచ్‌ 1బీ వీసాదారులు నూతన ఉద్యోగ అవకాశాలను ఇబ్బందిలేకుండా పొందవచ్చని పేర్కొంది.

Read More

బాంబులు గుర్తించినా పోలీసుల గోప్యమెందుకు?

-ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ విఫలం -కూటమి రాగానే అరాచకవాదులపై చర్యలు -కార్యకర్తలు సంయమనం పాటించాలి -గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు గుంటూరు, మహానాడు: పల్నాడులో దాడులపై గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు స్పందించా రు. ఎన్నికల రోజున వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డగోలుగా దాడులకు పాల్పడ్డారు. దాడులు నియంత్రించటంలో ఎన్నికల సంఘం, డీజీపీ, చీఫ్‌ సెక్రటరీ విఫలమయ్యారు. పల్నాడు జిల్లా పోలీసు యంత్రాంగం ఇంకా వైసీపీ […]

Read More

కియా అనుబంధ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

భారీగా ఆస్తినష్టం: ఇద్దరికి స్వల్పగాయాలు పెనుగొండ, మహానాడు: శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ మండల పరిధిలోని గుడిపల్లి ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఏర్పాటు చేసిన కియా అనుబంధ పరిశ్రమలో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం రాత్రి జరగడంతో కంపెనీలో ఎక్కువమంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇద్దరికి స్వల్పగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం.

Read More

టీడీపీ మహానాడు వాయిదా

అమరావతి, మహానాడు: ఈనెల 27, 28న జరగాల్సిన టీడీపీ మహానాడు వాయిదాను వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 4న ఎన్నికల ఫలితాలు, ప్రభుత్వ ఏర్పాటు హడావిడి ఉండ టంతో వాయిదా వేసినట్లు పార్టీ అధినేత చంద్రబాబు తెలిపారు. అయితే మహానాడు మాదిరిగా అన్ని గ్రామాల్లో ఎన్టీఆర్‌కు నివాళులు, పార్టీ జెండాల ఎగురవేత, రక్తదాన శిబిరాలు కొనసాగుతాయని వెల్లడిరచారు. మహానాడు నిర్వహణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Read More

భారత్‌లో రాబోయే బుల్లెట్‌ రైలు మార్గాలు

భారత్‌లో రైల్వే రవాణా వ్యవస్థను ప్రపంచ దేశాలతో పోటీగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇందులో భాగంగా అమృత్‌, వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు బుల్లెట్‌ రైళ్లు త్వరలో రాను న్నాయి. అందుకు అనుగుణంగా కొన్ని రైలు మార్గాలను అధునాతనంగా తీర్చిదిద్దను న్నారు. భారత్‌లో కొత్తగా రానున్న బుల్లెట్‌ రైలు మార్గాలలో ఢిల్లీ-అహ్మదాబాద్‌: 878 కి.మీ, ఢిల్లీ-అమృతసర్‌: 459 కి.మీ, ఢిల్లీ-వారణాసి: 800 కి.మీ, […]

Read More

స్పామ్ కాల్స్ నియంత్రణ?

రిజిస్టర్ కాని మొబైల్ నంబర్స్, అన్వాంటెడ్ కాల్స్ ను గుర్తించేలా సిరీస్ లు తీసుకు రావాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది.మార్కెటింగ్ కాల్స్ అయితే 140, సర్వీస్ కాల్స్ 160, ప్రభుత్వ ఏజెన్సీలు అయితే 111 సిరీస్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం.అలాగే, వీటి ఐడెంటిటీని టెలికాం సంస్థలు వెల్లడించాలి. ఆయా కంపెనీలే స్పామ్ కాల్స్ కి బాధ్యత వహించేలా కేంద్రం మార్గదర్శకాలు రూపొందించినట్లు సమాచారం.

Read More

అన్ని రకాల వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్‌

తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ కేవలం సన్న వడ్లకు మాత్రమే క్వింటాకు రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో రైతాంగంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. రైతాంగం పండించే అన్ని రకాల వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో వడ్లకు క్వింటాల్‌కు రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించింది. […]

Read More

ఇలాంటి ఫ్యాన్ ను ఎప్పుడైనా చూశారా?

1920 ల్లో ఫ్యాన్స్ ఇలా ఉండేవట ! ఎండవేడిమి నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడంటే ప్రతి ఒక్కరి ఇంట్లో దాదాపు సీలింగ్ ఫ్యాన్స్, కూలర్స్, ఏసీ లు వచ్చాయి. ఓ పాతిక, యాభై ఏళ్ళ క్రితం విసనకర్రలతో ఉక్కపోత నుంచి బయటపడేవాళ్ళం. అయితే 1920 ల్లో ధనికుల ఇంట్లో వినియోగించిన ఫ్యాన్ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి టేబుల్ ఫ్యాన్ మాదిరిగా ఇరువైపులా పంకాలు ఉండగా 360 […]

Read More