ఓటు వేసిన జి.వి.ఆంజనేయులు దంపతులు

వినుకొండ: పోలింగ్‌ కేంద్రాల దగ్గర సోమవారం ఉదయం 6.30 నుంచే ఓటర్లు బారులు తీరారు. ఎండలు మండుతుండటంతో ముందుగానే ఓటు వేసి వెళ్లేందుకు క్యూలు కట్టారు. వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు దంపతులు వినుకొండ పోలింగ్‌ కేంద్రం లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Read More

పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన చదలవాడ అరవిందబాబు

నరసరావుపేట, మహానాడు: నరసరావుపేటలో ఎన్జీవో హోమ్‌లో ఎన్నికల కేంద్రాన్ని సోమవారం నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పరిశీలించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రజలందరూ విజ్ఞతతో ఓటువేసి మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే ప్రజలందరూ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

Read More

టీవీ 5 రిపోర్టర్‌పై వైసీపీ శ్రేణుల దాడి

-తీవ్రగాయాలు..ఆసుపత్రికి తరలింపు -పల్నాడు జిల్లాలో ఘటన గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఎన్నికల వేళ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం ఓటు వేసి వెళుతున్న టీవీ 5 రిపోర్టర్‌ రవీంద్రపై దాడికి పాల్పడ్డారు. రవీంద్ర తన భార్యతో కలిసి ఓటు వేసి వెళుతుండగా ముసుగులు వేసుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Read More

ఆంధ్రప్రదేశ్ లో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు

ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద బారులు తీరారు. ఏపీలోని పలు పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో పలుచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని దుండగులు అపహరించారు. పోలింగ్ కేంద్రం నుంచి ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు. పోలింగ్ […]

Read More

ఓటు హక్కు వినియోగించుకున్న మెగాస్టార్ చిరంజీవి

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సినీ ప్రముఖులు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో కుటుంబసభ్యులతో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓటు వేశారు. చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఎవరి వల్ల […]

Read More

ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. లక్ష్మీనరసింహస్వామి కాలనీలోని గిరిజన కోపరేటివ్ సంస్థ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి భార్యతో కలిసి వచ్చారు. జనసేనాని రాకతో పోలింగ్ బూత్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. పవన్ ను చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి కంట్రోల్ చేయడానికి, జనాలను అదుపు చేయడానికి సిబ్బంది అవస్థలు పడ్డారు.

Read More

ఓటు వేసిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్

తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలోని పోలింగ్ బూత్ నెంబర్: 221 లో తన ఓటు హక్కును వినియోగించుకున్న గుంటూరు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్.

Read More

ఓటు వేసిన గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా

గుంటూరు లోని పట్టాభిపురం బేసిక్ హై స్కూల్లో బూత్ నెంబర్: 44లో ఓటు హక్కు విమోయోగించుకొన్న గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా, సిద్దార్థ్ గల్లా, అశోక్ గల్లా.

Read More

ఓటు వేసిన నారా లోకేశ్ దంపతులు

తెలుగు రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో బూలింగ్ బూత్‌లకు తరలివెళ్తున్నారు. ఇక ప్రముఖలు సైతం ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆయన భార్య నారా బ్రహ్మణి మంగళిగిరి నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్‌లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఓటు వేశారు. కాగా ఏపీలో ఓటింగ్ […]

Read More

ఓటు వేసిన సీఎం జగన్

ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కడప జిల్లా భాకరాపురంలో ఆయన ఓటు వేశారు. సీఎం జగన్‌తో పాటు భార్య వైఎస్ భారతి, కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 5 సంవత్సరాల పాలన చూశారని, తన ప్రభుత్వంలో లబ్ది పొందారని భావిస్తే మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసే పాలనకు […]

Read More