-గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి -హైకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం -కూటమి రాగానే డ్రామా బయటపెట్టి సన్మానిస్తాం -టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు విజయవాడ, మహానాడు: కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన బోండా ఉమామహేశ్వర రావును కావాలనే సీఎం జగన్ వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎన్నికల […]
Read Moreసివిల్స్ మూడో ర్యాంకర్‌కు రేవంత్ అభినందన
హైదరాబాద్: సివిల్స్ ఫలితాలలో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు సాధించిన పాలమూరుకు చెందిన దోనూరి అనన్యరెడ్డి శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆమెను అభినందించారు.
Read Moreచంద్రబాబు సీఎం కావడం చారిత్రక అవసరం
-రాష్ట్రంలో కూటమికి బ్రహ్మరథం పడుతున్నారు -ఒక్క ఛాన్స్ అంటూ జగన్ మోసగించారు -విజయవాడ పశ్చిమ కూటమి అభ్యర్థి సుజనాచౌదరి -బీజేపీ కార్యాలయంలో ఘనంగా బాబు జన్మదిన వేడుకలు విజయవాడ, మహానాడు: ఏపీలో చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సుజనాచౌదరి అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం బీజేపీ కార్యాలయంలో శనివారం చంద్రబాబు జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలతో […]
Read Moreబాలకృష్ణ ఆస్తుల విలువ 81.63 కోట్లు
హిందూపురం, మహానాడు: సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ శుక్రవారం నామినేషన్ వేశారు. ఆయన సతీమణి వసుంధరతో కలిసి హిందూపురం ఆర్వో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నామినేషన్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. నామినేషన్ పత్రాల్లో తన ఆస్తులు, అప్పుల వివరాలను అఫిడవిట్‌లో చూపించారు. దీని ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు కాగా, ఆయన భార్య వసుంధర […]
Read Moreనటుడు రఘుబాబుకు బెయిల్ మంజూరు
నల్గొండ, మహానాడు: రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ నటుడు రఘుబాబుకు శుక్రవారం బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 17న నల్గొండ శివారులో రఘుబాబు కారు ఢీకొని బీఆర్‌ఎస్ నాయకుడు మృతిచెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేశారు. నల్గొండ టూటౌన్ పోలీసులు రఘబాబును శనివారం కోర్టులో హాజరుపరచగా బెయిల్ మంజూరు చేశారు.
Read Moreకాపులపై కక్షగట్టిన జగన్ రెడ్డి
-ఈ గులకరాయి నాటకం…కోడికత్తి డ్రామా 2.0 -సానుభూతి డ్రామాలో బీసీ బిడ్డలను బలిచ్చారు -కాపు నేతలను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారు -టీడీపీ నేతల ఆగ్రహం విజయవాడ, మహానాడు: కాపులను అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి అడుగడుగునా కుట్రలకు తెరలేపుతున్నాడని టీడీపీ నేతలు పెద్దాపురం అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, భీమిలి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు, పాలకొల్లు అభ్యర్థి నిమ్మల రామానాయుడు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. గతంలో కోడికత్తి డ్రామాను చంద్రబాబుకు ఆపాదించారు. […]
Read Moreఅధికార పార్టీ నీడలోనే పోలీసులు
-రాయిదాడి కేసులో టీడీపీ అభ్యర్థిపై కుట్ర -విజయవాడ పోలీసు కమిషనర్ పన్నాగం -కేంద్ర ఎన్నికల సంఘానికి మాజీ ఎంపీ కనకమేడల లేఖ అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ వచ్చినా ఇంకా అధికార పార్టీ నీడలోనే పోలీసులు పనిచేస్తున్నారని, ఇందుకు సంబంధించి తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు టీడీపీ నేత, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ శనివారం లేఖ రాశారు. పోలీసులను అస్త్రంగా చేసుకుని ఐదేళ్ల పాటు […]
Read Moreసీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు
బాచుపల్లి, మహానాడు: సీబీఎన్ ఫోరం ఆధ్వర్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు శనివారం బాచుపల్లిలోని మీనాక్షి ఓల్డేజ్ హోమ్ ఫౌండేషన్‌లో ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి వయోవృద్ధులకు పండ్లు, రొట్టెలు, బిస్కెట్లు, స్నాక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సీబీఎన్ ఫోరం కోర్ టీం సభ్యులు అనిల్, హరీష్, కిరణ్ కలపాల, నిర్మల్‌కుమార్, సునీత, అమూల్య, శివకుమార్, అభిరామ్, రాజేంద్రప్రసాద్, సురేష్‌చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ […]
Read Moreటీడీపీలోకి రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు
చంద్రబాబు సమక్షంలో చేరిక రాయదుర్గం, మహానాడు: రాష్ట్ర కురుబ సంఘం అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు టీడీపీలో చేరారు. శుక్రవారం రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాయదుర్గం కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఆధ్వర్యంలో ఆయన చేరారు. ఈ సందర్భంగా బోరంపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని తెలిపారు.
Read Moreకుప్పం అన్నా క్యాంటీన్ లో నారా భువనేశ్వరి అన్నదానం
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ కార్యకర్తలు నడుపుతున్న అన్నా క్యాంటీన్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన కేక్ ను భువనేశ్వరి కట్ చేశారు. పేదవారికి అన్నా క్యాంటీన్ లో అన్నదానం చేశారు. అన్నా క్యాంటీన్ నిర్వాహకులను భువనేశ్వరి ప్రత్యేకంగా అభినందించారు.
Read More