-‘సూర్య తిలకం’ కోసం ప్రత్యేక టెక్నాలజీ -అయోధ్యలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు అయోధ్యలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలి శ్రీరామ నవమి కావడంతో వేడుకలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో స్వామి వారిని మేల్కొలిపారు. మంగళ హారతి, దివ్యాభిషేకం నిర్వహించి ప్రత్యేక […]
Read Moreనేత్రపర్వం.. భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం
తరలి వచ్చిన భక్తజనం భద్రాచలం: శ్రీరామ నవమి భద్రాచల క్షేత్రంలో బుధవారం సీతారాముల కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కల్యాణం సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారలకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం తెల్లవారు జామునే ఆలయ ద్వారాలను తెరిచి అర్చకులు.. రామయ్యకు సుప్రభాత సేవ జరిపారు. అనంతరం తిరువారాధన, ఆరగింపు, […]
Read Moreశ్రీవిష్ణు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్.. 60 శాతం చిత్రీకరణ పూర్తి
వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు రీసెంట్‌గా సామజవరగమన, ఓం భీమ్ బుష్ చిత్రాలతో వరుస విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన తన తదుపరి చిత్రాన్ని ఈరోజు ప్రకటించారు. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. లైట్ బాక్స్ మీడియా, పిక్చర్ పర్‌ఫెక్ట్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్స్‌పై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘సామజవరగమన’ […]
Read More“తంగలాన్” నుంచి విక్రమ్ బర్త్ డే స్పెషల్ గ్లింప్స్
చియాన్ విక్రమ్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ “తంగలాన్”. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ బ్యానర్స్ పై ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇవాళ చియాన్ విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ “తంగలాన్” సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం విక్రమ్ ఎంతగా కష్టపడ్డాడో ఈ గ్లింప్స్ […]
Read More“టుక్ టుక్” సరి కొత్త టైటిల్
చిత్రవాహిని మరియు ఆర్ వై జి బ్యానర్‌లు తమ తాజా చలనచిత్రం టైటిల్ “టుక్ టుక్” టైటిల్ పోస్టర్ ని శ్రీ రామ నవమి సందర్భంగా విడుదల చేశారు. విచిత్రమైన ఆటో ఈ పోస్టర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. చూడడానికి ఏదో ఫాంటసీ చిత్రాన్ని తలపించేలా పోస్టర్ లుక్ ఉంది. సుప్రీత్ సి కృష్ణ దర్శకత్వం వహించిన, “టుక్ టుక్” ఒక ఆహ్లాదకరమైన సినిమాటిక్ అనుభూతిని అందిచేలా ఉంది, […]
Read More‘మారుతి నగర్ సుబ్రమణ్యం’లో రొమాంటిక్ సాంగ్
రావు రమేష్ హీరోగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. రావు రమేష్ సరసన ఇంద్రజ నటించారు. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించారు. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై సినిమా రూపొందుతోంది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలు. సినిమాలో రెండో పాట ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ను ఇవాళ విడుదల చేశారు. […]
Read Moreతరతరాల స్ఫూర్తిప్రదాత
యవత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే, తావద్రామాయణకథా లోకేషు ప్రచరిష్యతి! ” భూతలమునందు పర్వతములును., నదులును ఉన్నంతవరకును రామాయణ కథ లోకములో వ్యాపించి ఉండును” ఒక నాడు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమమునకు వస్తాడు. అప్పుడు వాల్మీకి నారదుడిని ఒక ప్రశ్న అడుగుతాడు. *కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రత!! చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః […]
Read Moreబీసీలకు మేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే
కన్నా లక్ష్మీనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో కన్నా, లావు బీసీ నాయకులకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. రాజుపాలెం మండలం రాజుపాలెంలో మంగళవారం ముదిరాజుల ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలను మోసం చేసిన ఘనత జగన్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో […]
Read Moreప్రైవేటు టీచర్లను పట్టించుకోని జగన్ రెడ్డి
వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు: కరోనా కాలంతో ఆ తర్వాత రాష్ట్రంలో ప్రైవేటు టీచర్ల కష్టాలను జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేద వినుకొండ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు అన్నారు. శివశక్తి ఫౌండేషన్ తరఫున వ్యక్తిగత స్థాయిలో తాను సాయం చేశానని గుర్తు చేశారు. మంగళవారం వినుకొండ గంగినేని కల్యాణ మండపంలో నిర్వహించిన ప్రైవేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆత్మీయ సమావేశంలో […]
Read Moreపోలింగ్ నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు నిషిద్ధం
విజయవాడ, మహానాడు: పోలింగ్ రోజు, పోలింగ్‌కు ముందు రోజు ముందస్తు అనుమతి లేకుండా ప్రింట్ మీడియాలో ఎలాంటి రాజకీయ ప్రకటనలను ప్రచురించకూడదని ఎలక్షన్ కమిషన్ ఉత్వర్వులు జారీ చేసినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గతంలో పలు సందర్భాల్లో ప్రింట్ మీడియాలో అభ్యంత రకరమైన, తప్పుదారి పట్టించే ప్రకటనలు ప్రచురితమైనట్లు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వచ్చినట్లు […]
Read More