-దావూద్‌పై కూడా ఇన్ని కేసులు లేవు -సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా సీఎం జగన్‌పై ఉన్నన్ని కేసులు దావూద్ ఇబ్రహీంపైనా ఉండ వేమోనని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. సీఎం జగన్‌పై 38 క్రిమినల్ కేసులున్నాయి. ఇందులో 11 సీబీఐ నమోదు చేసినవి, 7 ఈడీ దాఖలు చేసినవి. దాదాపు ఇవన్నీ 13 ఏళ్లుగా విచారణ దశలోనే ఉన్నాయి. 146 నేరాభియోగాల్లో ఆయనే నిందితుడిగా ఉన్నారు. […]
Read Moreవైసీపీకి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ రాజీనామా
అమరావతి, మహానాడు : వైసీపీ సభ్యత్వానికి కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పదవికి కిలారు అశోక్‌బాబు బుధవారం రాజీనామా చేశారు. పార్టీలో ఎన్నో అంతర్గత విభేదాలు ఉన్నా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించు కోక పోవడంతో మనస్థాపం చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఐదేళ్లలో నియోజవర్గ పరిధిలో అభివృద్ధి లేదని చెప్పారు. కమ్మ కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదని కార్యకర్తలకు ఎటువంటి సహాయం చేయలేకపోయానన్న బాధ ఉందన్నారు. […]
Read Moreవర్ష బీభత్సం తో దుబాయ్ విలవిల
వర్ష బీభత్సానికి దుబాయ్ విలవిలలాడిపోతోంది. కేవలం గంటన్నర వ్యవధిలో అంటే 90 నిమిషాల్లో.. ఏడాదిలో కురవాల్సిన వర్షమంతా ఒకేసారి కురిసింది. మాల్స్ అన్నీ నీటితో నిండిపోయాయి. దుబాయ్ ఎయిర్ పోర్టులోనూ వర్ష బీభత్సం ప్రత్యక్షంగా కనిపించింది. దీంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బయటి రోడ్లను చూస్తే అవి చెరువులను తలపించాయి. సబ్ వేలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నిలిపివుంచిన కార్లు నీటిలో కొట్టుకుపోయాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న […]
Read More‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టిన నిర్మాత వేణు దోనేపూడి
జగదభిరాముడు, సకల గుణధాముడు..ధర్మ రక్షకుడు, ఏకపత్నివ్రతుడైన అయోధ్య రామయ్యను స్మరిస్తూ అనంత కోటి భక్తజనం అత్యంత వైభవంగా, భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండగ శ్రీరామనవమి. ఈ పర్వదినాన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి తన చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2ను అనౌన్స్ చేశారు. ‘జర్నీ టు అయోధ్య’ అనేది వర్కింగ్ టైటిల్. ప్రముఖ దర్శకుడు వి.ఎన్.ఆదిత్య కథను అందిస్తున్నారు. రామాయణంపై, రామాయణంను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు చాలా […]
Read Moreనామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయండి
`గుంటూరు రోడ్డు రంగా విగ్రహం నుంచి ర్యాలీ `నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపు నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా తాను, పార్లమెంట్ అభ్యర్థిగా కృష్ణదేవరాయలు నామినేషన్ వేస్తున్నా మని ఈ కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు విజయవంతం చేయాలని నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం 10 గంటలకు గుంటూరు రోడ్డులోని రంగా విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం […]
Read Moreఉన్మాది పాలనలో రాజధాని విధ్వంసం
అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఇన్‌సైడర్ ట్రేడిరగ్ అంటూ అబద్ధాల ప్రచారం రాజకీయ లబ్ధి కోసం నాశనం చేశారు గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అమరావతి, మహానాడు : రాజధానిలో ఇన్‌సైడ్ ట్రేడిరగ్ జరిగిందని జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పారని, ఐదేళ్లలో ఒక్కటి కూడా నిరూపించలేదని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. 125 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కంపెనీలు ఇక్కడ వస్తే వాటిని […]
Read Moreఈ చిత్ర కథాంశం ప్రతి ఒక్కరికి రిలేటెడ్‌గా ఉంటుంది – సత్యం రాజేష్
‘పొలిమేర-2’తో ఊహించని సక్సెస్ అందుకున్న సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మేఘా చౌదరి, చందన పయ్యావుల, ఎస్తర్ నోరోన్హా, భరత్ కాంత్ కీలక పాత్రలు పోషించారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కొత్తగా […]
Read Moreనెటింట్లో ‘ఒసేయ్ అరుంధతి’ పాట హల్‌చల్
మోనికా చౌహాన్, కమల్ కామరాజు, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్ ‘ఒసేయ్ అరుంధతి’. విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో గూడూరు ప్రణయ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. దర్శకుడు ఈ పాటను బాగా రాశారు… ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీత […]
Read Moreసీఎం జగన్ కోడ్ ఉల్లంఘనలపై ఈసీ చర్యలు తీసుకోవాలి
పోటీ చేయకుండా నిషేధం విధించాలి వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు శావల్యాపురం మండలంలో లావు, మక్కెనతో విస్తృత ప్రచారం వినుకొండ, మహానాడు : తన పదవి స్థాయి కూడా మరిచి విపక్షాలపై బరితెగించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కోడ్ ఉల్లంఘనలపై ఈసీ తక్షణం చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, వినుకొండ కూటమి అభ్యర్థి జి.వి.ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రత్యర్థుల వ్యక్తిగత జీవితాలను లక్ష్యం చేసుకోవద్దని ఎంసీసీలో నిషేధం […]
Read More“ఆదిశక్తి” సేవా సంస్థను లాంఛ్ చేసిన సంయుక్త
స్టార్ హీరోయిన్ సంయుక్త నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చింది. సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఈ స్టార్ హీరోయిన్ అడుగు ముందుకు వేసింది. ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా ఆదిశక్తి అనే సేవా సంస్థను అనౌన్స్ చేసింది. ఈ సంస్థ ద్వారా మహిళలకు అనేక రంగాల్లో సహకారం అందించబోతోంది. మహిళలకు సమాన అవకాశాలు కల్పించి వారిని […]
Read More