పట్టుకున్న ఆవుల వాహనాన్ని వదిలేశారు!

-మంగళగిరి రూరల్‌ పోలీసుల నిర్వాకం -కాసుల కోసం మధ్యవర్తితో మంతనాలు గుంటూరు: శవాలపై పేలాలు ఏరుకునే రకం రాష్ట్రంలో పోలీసు వ్యవస్థది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారతారు. వారి చేతివాటాన్ని నిత్యం మనం కళ్లముందు చూస్తూనే ఉంటాం. కాసులు వస్తున్నాయంటే మూగజీ వుల ప్రాణాలు కూడా తీస్తారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. కాజ టోల్‌గేట్‌ దగ్గర మంగళగిరి రూరల్‌ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కంటై నర్‌లో […]

Read More

క్షతగాత్రులకు నాదెండ్ల మనోహర్‌ పరామర్శ

తెనాలి ప్రభుత్వ వైద్యశాల పరిస్థితిపై ఆరా కూటమి వచ్చాక సౌకర్యాలు మెరుగుపరుస్తామని వెల్లడి తెనాలి: ఇటీవల రేపల్లె సమీపంలో ట్రాక్టర్‌ ప్రమాదంలో గాయపడి కొల్లిపర మండలానికి చెందిన 20 మంది గాయపడిన విషయం తెలిసిందే. వారు తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. బాధితులను బుధవారం ఉదయం తెనాలి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పరామర్శించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన […]

Read More

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో చంద్రబాబుకు ఘనస్వాగతం

-ఎన్నికల అనంతరం విశ్రాంతి కోసం అమెరికా పయనం -విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత హైదరాబాద్‌: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ కూడా ఉన్నారు. ఎన్నికల అనంతరం బాబు […]

Read More

పల్నాడు డీపీవోపై విచారణకు ఈసీ ఆదేశాలు

-టీడీపీ ఫిర్యాదుతో స్పందించిన ఎన్నికల సంఘం -ఈవీఎం ధ్వంసంపై నివేదిక ఇవ్వాలని సూచనలు నరసరావుపేట: పల్నాడు డీపీవో విజయభాస్కర్‌రెడ్డిపై విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మాచర్ల నియోజకవర్గానికి ఆయన వెబ్‌ కాస్టింగ్‌ పర్యవేక్షణాధికారిగా ఉన్నారు. పాల్వాయి గేట్‌ 202 బూత్‌లో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేసిన విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పకుండా గోప్యంగా […]

Read More

పల్నాడు ఎస్పీ కార్యాలయానికి పిన్నెల్లి

నరసరావుపేట, మహానాడు: మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని షరతులు విధించింది. ప్రతిరోజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని, నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలోనే ఉండాలని ఆదేశించింది. దాంతో ఆయన హైకోర్టు అదేశాల మేరకు మంగళవా రం అర్ధరాత్రి పల్నాడు ఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన పూర్తి వివరాలు అందజేశారు.

Read More

3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం: డీజీపీ

అమరావతి: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా మని డీజీపీ హరీష్‌గుప్తా వెల్లడిరచారు. జూన్‌ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాల ను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్‌, లాడ్జీలలో తనిఖీలు నిర్వహించి అనుమాని తులను అదుపులోకి తీసుకోవాలని సూచించారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తల ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More

హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌, మహానాడు: విదేశీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, పలువురు నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.

Read More

పెళ్లిరోజు చావుకొచ్చింది..

-మండీ బిర్యానీ తిని ఎనిమిది మందికి అస్వస్థత -బిర్యానీ బిల్లు వెయ్యి అయితే…హాస్పిటల్‌ బిల్లు లక్ష (శివశంకర్‌ చలువాది) వండుకోవడానికి టైమ్‌ లేదనో..రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుందనో బయట రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తిన్నారో.. ఇక అంతే సంగతులు అన్నట్టు తయారైంది పరిస్థితి. పరిశుభ్రతలేని కిచెన్‌లు, కల్తీ పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, కాలం చెల్లిన సరుకులతో తయారీ, ఇదీ ఇప్పుడు హోటల్స్‌లో పరిస్థితి. తాజాగా ఇలాంటి ఘటననే రంగారెడ్డి […]

Read More

జూన్‌ 2 నుంచి టోల్‌గేట్‌ చార్జీల మోత

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు జూన్‌ 2 నుంచి పెంచనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 2న ఈ చార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్‌ 2 నుంచి టోల్‌ చార్జీలను సగటున 5 శాతం పెంచి వసూలు చేయనున్నారు.

Read More

సీఈవో గైడ్‌ లైన్స్‌ పై పేర్ని నాని అభ్యంతరం

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో రాష్ట్రంలో లేని వెసులుబాటు ఈ రాష్ట్రం లో ఎందుకు ఇచ్చారు? అని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చారు? ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్‌ లైన్స్‌ ఎలా ఇస్తారని నిలదీశారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో ఎక్కడా లేని సర్క్యులర్‌ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్‌? ఈ నిర్ణయంపై పునరాలోచన చేయా లని కోరారు.

Read More