కౌంటింగ్‌ తర్వాత కేసులపై దర్యాప్తు వేగవంతం

ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేశాం పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ నరసరావుపేట: పల్నాడు జిల్లాలో కౌంటింగ్‌ సందర్భంగా ఫలితాలు విడుదలైన తర్వాత నమోదైన కేసుల దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటికీ 60 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్‌ అమలులో ఉన్నా కొంతమంది గుంపులుగా చేరి గ్రామాల్లో విచ్చలవిడిగా తిరు గుతూ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి ప్రత్యర్థుల ఇళ్లపై దాడులు […]

Read More

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా?? : జైరాం రమేశ్

ఆంధ్రప్రదేశకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఏపీతోపాటు బీహార్ రాష్ట్రానికి హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తారా అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆపేస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.

Read More

చంద్రబాబు ప్రమాణస్వీకారం కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది

ప్రతిపక్ష హోదా పోయినా వైసీపీకి బుద్ధిరాలేదు వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా మరోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం కోసం యావత్‌ రాష్ట్రం వేయికళ్లతో ఎదురు చూస్తోందని వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు పేర్కొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, లీలావతి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మూడోసారి విజయం సాధించిన జీవీని చంద్రబాబు అభినందించా రు. అనంతరం […]

Read More

ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు

బ్యూరోక్రాట్స్‌ పాలన ఎంతమాత్రం ఉండదు తరచూ వచ్చి కలవండి..బిజీగా ఉన్నా కలుస్తా కార్యకర్తలు, నేతల కృషివల్లే అధికారం సాధ్యమైంది ఐదేళ్లు వారి ఇబ్బందులు మనోవేదన కలిగించాయి ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి ఈ నెల 12న ప్రమాణస్వీకారం చేస్తున్నా… దిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయాలి ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు అమరావతి : ఉండవల్లిలోని నివాసంలో ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై […]

Read More

ఎన్నికల కోడ్ ఎత్తివేత..

దేశంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది.

Read More

వారంలో వైసీపీ ఎమ్మెల్యేలు జంపింగ్‌

పులివెందులలో నామరూపం కాబోతుంది బీజేపీకి నాయకులు లైన్‌ కడుతున్నారు లిక్కర్‌ కుంభకోణంలో భారతి హస్తం భారతి రాజ్యాంగంతో వ్యవస్థల భ్రష్టు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విజయవాడ: జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గెలిచిన తర్వాత గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఆయన బీజేపీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌ రెడ్డిలతో భేóటీ అయ్యారు. […]

Read More

కృష్ణా జిల్లాలో ఆ పిచ్చికుక్కలను వదిలేది లేదు

తెలుగుదేశం పార్ట్‌ 1 చూశారు..ఇక పార్ట్‌ 2 చూస్తారు ఇక జగన్‌ జీవితం జైలుకే… సజ్జల కూడా త్వరలోనే వెళతాడు బెట్టింగ్‌ల కోసం చేసిన ఫేక్‌ సర్వే..ఆరా మస్తాన్‌ సర్వే జగన్‌, కేటీఆర్‌ కలిసి పోటీ చేసినా లోకేష్‌ మెజార్టీ రాలేదు బీసీల వ్యతిరేకి జగన్‌..ఇక రాజకీయాలకు స్వస్తి పలకాల్సిందే చంద్రబాబును విమర్శించారు..అందుకే ప్రతిపక్ష హోదా దక్కలేదు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శలు విజయవాడ: ఏపీలో ఎన్నికలకు […]

Read More

చిరు ఇంట్లో మెగా సంబరాలు..

ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య ఇంటికి తమ్ముడు. పవన్‌ను హత్తుకుని శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి. పవన్‌కు స్వీట్స్‌ తినిపించి విక్టరీని సెలబ్రేట్‌ చేసుకున్న కుటుంబసభ్యులు. చిరంజీవి ఇంటి దగ్గరకు చేరుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాలుస్తూ సంబరాలు.

Read More

యూకేలో టీడీపీ సంబరాలు

అమరావతి:  విజనరీ లీడర్‌ చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ఘన విజయంతో ఖండాంతరాల్లో ఉన్న టీడీపీ అభిమానులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకుం టున్నారు. లండన్‌, బర్మింగ్‌హామ్‌, రెడిరగ్‌, కోవెంట్రీ, మాంచెస్టర్‌, హేమల్‌ హ్యాంప్‌ స్టెడ్‌, అబెర్డీన్‌, కార్డీఫ్‌ తదితర నగరాలలో జరిగిన కార్యక్రమాలలో కేక్‌ కట్‌ చేసి జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు.

Read More

కంగ్రాట్స్‌ చంద్రబాబు సార్‌ : పీవీ సింధు

అమరావతి:  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు అభినందనలు తెలిపారు. ‘మీ దార్శనిక నాయకత్వం నిస్సందేహంగా ఏపీని పురోగతి వైపు నడిపిస్తుంది. నా కెరీర్‌ తొలినాళ్లలో మీ నుంచి నాకు అమోఘమైన మద్దతు లభించింది. అప్పుడు మీరు చూపిన ఆప్యాయత ఎప్పటికీ గుర్తుంటుంది. మిమ్మల్ని మళ్లీ సీఎంగా చూస్తుండటం సంతోషాన్నిస్తోంది సార్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. అలాగే పవన్‌ కళ్యాణ్‌, పురంధేశ్వరికి అభినందలు తెలిపారు.

Read More