శేషగిరిరావు ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

ఫోన్‌లో బాధితుడికి పరామర్శ ధైర్యంగా పోరాడారని అభినందన పార్టీ అండగా ఉంటుందని భరోసా అమరావతి, మహానాడు : మాచర్ల పాల్వాయి గేటు పోలింగ్‌ స్టేషన్‌ ఘటనకు సంబంధించి పిన్నెల్లి అనుచరుల దాడిలో గాయపడ్డ బాధితుడు నంబూరి శేషగిరిరావును టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఫోన్‌లో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మీరు చూపిన ధైర్యం, పోరాటం ప్రశంసనీయమని అభినందించారు. పోలింగ్‌ […]

Read More

పద్మావతిని దర్శించుకున్న స్వరూపానందేంద్ర స్వామి

తిరుపతి : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని విశాఖ శారదా పీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిజీ లు బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ చంద్రశేఖర్‌, ఇన్‌స్పెక్టర్‌ ప్రసాద్‌, ఎ.వి.ఎస్‌.వో.సతీష్‌కుమార్‌, అర్చకులు బాబు స్వామి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవా రి కుంకుమార్చన సేవలో పాల్గొన్న స్వామిజీలకు ఆలయాధికారులు అమ్మవారి కుంకుమ, వస్త్రం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Read More

వైౖసీపీ డబ్బు పంచితే…కూటమికి ఓట్లేశారు

రూ.5 వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? విదేశాల నుంచి జగన్‌ ఇక తిరిగి రాడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించి ఎంజాయ్‌ చేస్తున్నాడు ఈవీఎంలను మార్చొచ్చు..ఈసీ జరజాగ్రత్త పోస్టల్‌ బ్యాలెట్లు 99 శాతం కూటమికే.. తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ తిరుపతి, మహానాడు : సీఎం జగన్‌పై తిరుపతి కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి చింతామోహన్‌ సంచలన వ్యాఖ్య లు చేశారు. డబ్బులు వైసీపీ నేతలు పంచితే ఓట్లు మాత్రం కూటమికి […]

Read More

టీడీపీ అభ్యర్థిపై వైసీపీ ఫిర్యాదు

సచివాలయం, వెలగపూడి, మహానాడు : డబ్బుతో ఓట్లు కొనుగోలు చేసిన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజక వర్గం టీడీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంచారని, ఇది మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌కు విరుద్ధమన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను పార్టీ నాయకులు మల్లాది విష్ణు, గ్రీవెన్స్‌ సెల్‌ చైర్మన్‌ నారాయణమూర్తి అందచేశారు.

Read More

బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ వెయ్యి రెట్లు బెటర్‌

వ్యవసాయం, ధాన్యం సేకరణలో ముందున్నాం ఇది తెలంగాణ రైతుల అభిప్రాయం భవిష్యత్‌లో దొడ్డు వడ్లకు బోనస్‌ ఇస్తాం పేదోళ్లు కూడా సన్నబియ్యం తినాలన్నదే తమ ఉద్దేశం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాం వచ్చే ఎన్నికల నాటికి హామీలన్నీ పూర్తిచేస్తాం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌తో పోలిస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యవసాయం, ధాన్యం సేకరణలో వెయ్యి రెట్లు మేలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. […]

Read More

ఈవీఎమ్ ను బద్దలు కొట్టినా చర్యలు లేవు

-పోలింగ్ తర్వాత పిన్నెల్లి నాయకత్వంలో అల్లర్లు, అరాచకాలకు అంతు లేదు -ఎన్నికల్లో అడ్డదారిలో గెలిచేందుకు ప్రత్యర్థులపై దాడులకు తెగబడ్డ పిన్నెల్లి బ్రదర్స్ – టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికలు జరిగిన రోజున ఈవీఎంను బద్దలు కొట్టడం అంటే రాజ్యాంగ స్పూర్తిని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. పోలింగ్ జరిగిన నాటి నుండి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన […]

Read More

ఐదు నెలల కాంగ్రెస్‌ పాలన నిరాశాజనకం

హామీలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి బోనస్‌పై మంత్రులు పూటకో మాట చెబుతున్నారు బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి హైదరాబాద్‌, మహానాడు : బీఆర్‌ఎస్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలైనా పనితీరు మాత్రం పూర్తి నిరాశాజనకంగా ఉంది. కాంగ్రెస్‌ అభయ హస్తం అక్కరకు రాని నేస్తంగా మారింది. సీఎం రేవంత్‌ మంత్రులకు దేని మీద స్పష్టత లేదు. తలో […]

Read More

ధాన్యం మొలకెత్తుతున్నా కొనరా?

తరుగు పేరుతో మరో మోసమా? మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజం కొనుగోలు కేంద్రం సందర్శన సిద్దిపేట, మహానాడు : సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడు తూ తుఫాన్‌ ప్రభావంతో వచ్చే మూడురోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు. చిన్నకోడూరు […]

Read More

రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు

విజయవాడ :  బెంగుళూరు రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసుది విజయవాడ కాగా క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడని చెబుతున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాలతో సంబంధం ఉందని అంటున్నారు. క్రికెట్‌ బుకీ వ్యవస్థ నడిపిస్తూ ఇటీవల వాసు గ్యాంగ్‌ ఖరీదైన స్థలాలు కొన్నట్లు సమాచారం. బెంగుళూరులో రేవ్‌ పార్టీకి వాసు అండ్‌ టీమ్‌ కూడా పనిచేసినట్లు గుర్తించారు.

Read More

మొలకెత్తిన వడ్లను కొనండి

రైతుకు మద్దతుగా హరీష్‌రావు ట్వీట్‌ ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంపై ఆగ్రహం హైదరాబాద్‌, మహానాడు : ఐదు రోజులైనా ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో ఆవేదనకు గురైన సంతోష్‌ అనే రైతుకు మద్దతుగా ఎక్స్‌ వేదికగా మాజీ మంత్రి హరీష్‌రావు స్పందించారు.  కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్ల కొనుగోలులో చూపుతున్న తీవ్ర నిర్లక్ష్యానికి మెదక్‌ జిల్లాకు చెందిన సంతోష్‌ అనే రైతు కష్టాలే నిదర్శనమన్నారు. మెదక్‌ జిల్లా చేగుంట మండలం పులిమామిడి కిష్టాపూర్‌ గ్రామానికి […]

Read More