లక్నో: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు.. వారణాసి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ప్రధాని నరేంద్ర మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కంటే ముందు ప్రధాని మోదీ గంగా నది తీరంలో ఉన్న దశాశ్వమేథ ఘాట్‌లో ప్రత్యేక పూజలు […]
Read Moreజపాన్ లో తొలి 6G డివైజ్
ప్రపంచం లోనే తొలి 6G డివైజ్ ను జపాన్ ఆవిష్కరించింది.. 5G ఇంటర్నెట్ తో పోలిస్తే ఈ డివైజ్ 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్ లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300 అడుగుల ప్రాంతాన్ని కవర్ చేసేలా 6G సేవల్ని అందిస్తుంది. ఈ డివైజ్ స్మార్ట్ ఫోన్ కాదని, ఒక ప్రత్యేకమైన పరికరమని టెలికం వర్గాలు పేర్కొన్నాయి.
Read Moreరాష్ట్రానికి మోదీ గ్యారంటీతో ప్రజల్లో చైతన్యం
` పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ప్రాజెక్టులే ధ్యేయం – బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర గుంటూరు, మహానాడు : ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ గ్యారంటీ అని ప్రజలు విశ్వసించినందు వల్లే ఓటింగ్‌కు పెద్దఎత్తున తరలివచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ అన్నారు. గుంటూరులో మంగళవారం విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు అవుతారని అన్నారు. […]
Read Moreకెనడాలో పదేళ్ల తెలంగాణ ఉత్సవాలు
ఒక్క చోట చేరి సంబూరాలు చేసుకున్న తెలంగాణ ప్రవాసులు. అభినందనల సందేశం పంపిన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర ప్రముఖులు కెనడా ప్రముఖ నగరం టోరంటోలో తెలంగాణ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ యేడాది జూన్ తో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పదేళ్లు నిండుతున్న సందర్భంగా కెనడాలో స్థిరపడిన ప్రవాసులు తెలంగాణ నైట్ పేరుతో ఉత్సవాలను నిర్వహించారు. టోరంటో, మిసిసాగ ఈ వేడుకలకు వేదిక అయింది. తెలంగాణ డెవలప్ మెంట్ […]
Read Moreపల్నాడులో హింసను ఖండించిన టీడీపీ అభ్యర్థులు
కలెక్టర్, ఎస్పీ ఉన్నా దాడులు ఆగలేదు ముందుగానే రాళ్ల కుప్పలు, కర్రలు తెచ్చారు అటువంటి చోట రీ పోలింగ్ నిర్వహించాలి మాచర్లలో పిన్నెల్లి తమ్ముడి అరాచకాలు నరసరావుపేటలో అభ్యర్థులపై దాడి హేయం పోలింగ్ శాతాన్ని తగ్గించేందుకు కుట్ర పన్నారు నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాలో వైసీపీ శ్రేణుల దాడులు, అరాచకాలపై పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థులు ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోనే ఎక్కువగా హింసాత్మక ఘటనలు జరిగాయని, పోలీసులు, అధికారులు ప్రేక్షకపాత్ర […]
Read Moreఅందుకే.. మనవాళ్ళు వట్టి వెధవాయలోయ్!
బట్టల షాప్ ప్రారంభానికి సినీనటి…జనాలను అదుపు చేయలేకపోయిన పోలీసులు…ట్రాఫిక్ జామ్. విదేశీ ఐకియా / లులు షాప్స్ ప్రారంభం…జనాలను అదుపు చేయలేక పోయిన సెక్యూరిటీ సిబ్బంది… తొక్కిసలాట. సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్ ఎక్కడ చూసినా జన సంద్రమే! కోటి దీపాల ఆరాధన కార్యక్రమం…. లక్ష మందికి పైగా వారం రోజులు సమయం కేటాయించి తప్పకుండా హాజరు. పెద్దాయనకు ఉత్సవాలు….లక్షలాది మంది వారం పది రోజులు క్రమం తప్పకుండా హాజరు, […]
Read Moreజూన్ 4 తర్వాత యరపతినేని మార్క్ రాజకీయం
కాసు మహేష్‌రెడ్డికి బుద్ధి చెప్పడం తథ్యం పెట్రోల్ బాంబులు, నాటు బాంబులతో తెగబడ్డారు గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు తంగెడలో బాధిత కుటుంబాలకు పరామర్శ, ఆర్థికసాయం గురజాల, మహానాడు : పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగెడ గ్రామంలో పోలింగ్ సందర్భంగా సోమవారం జరిగిన విధ్వంసకరమైన ఘటనకు సంబంధించి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాసరావు మంగళవారం విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ […]
Read More2019 కంటే ఎక్కువగా సైలెంట్ ఓటింగ్
అణిచివేత వర్సెస్ ఆత్మాభిమానం మధ్య ఎన్నికలు బలంగా ప్రజల్లోకి ల్యాండ్ టైటిలింగ్ ప్రచారాస్త్రం కూటమి పొత్తును నిలబెట్టిన ప్రజలు అమరావతి : ఈసారి సామాన్య ఓటరు అసలు భయపడలేదు. సైలెంట్ ఓటింగ్ ఎక్కువగా ప్రభు త్వాలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ప్రజలకు పాలకులు ఏమి చేసినా, చేయకపోయినా హింస, అణిచివేత, అహంకారాన్ని మాత్రం తట్టుకోలేరు. ఎంత గొప్పవాడైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఈ ఎన్నికలు హింస, అణిచివేత, అహంకారం వర్సెస్ ఆత్మాభిమా నం […]
Read Moreప్రతిపక్ష హోదా పొందలేని స్థితిలో
వైసీపీకి దక్కనున్న స్థానాలు! నా తెలుగుజాతికి ఈరోజు ప్రత్యేక శుభోదయం. ఆత్మగౌరవంతో రాజకీయ చైతన్యంతో రాష్ట్రం నలుమూలలా వైసీపీ రాక్షసులను, కాలకేయులను, సైకోలను, అహంకారులను తరిమి తరిమికొట్టిన నా తెలుగుజాతికి తెలుగు యువతకు, తెలుగు మహిళలకు, జనసైనికులకు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాని రీతిలో ఓట్లతో పోటెత్తి అమోఘమైన ప్రజాస్వామిక తీర్పును ఇచ్చిన ఆంధ్రులకు నమస్సుమాంజలులు. తెలుగుదేశం కూటమికి 155 నుంచి 160 సీట్లు, […]
Read Moreబీజేపీ, శివసేన ప్రభుత్వం భారీ కుంభకోణం
రూ.10 వేల కోట్లు దిగమింగిన షిండే, ఫడ్నవీస్ అంబులెన్స్‌ల కొనుగోళ్లలో చేతివాటం బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం గప్‌చుప్‌గా అవినీతి ప్రసార మాధ్యమాలు మహారాష్ట్ర, మహానాడు : షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం రూ.10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడినట్లు ఓ టీవీ చానల్ సంచలనాత్మక కథనం ప్రసారం చేసింది. అంబులెన్స్‌ల కొనుగోలు ఒప్పందం దుర్వినియోగంపై బాంబే హైకోర్టు షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. సుమీత్ ఫెసిలిటీస్, బీవీజీ కంపెనీలు ప్రభుత్వానికి […]
Read More