ప్రతి హామీ అమలుకు ప్రభుత్వం కృషి

– ‘ప్రజాదర్బార్’ లో ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, వినతులు స్వీకరించారు. పట్టణంలోని 24వ వార్డలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం మాది. ప్రజా ప్రభుత్వం ప్రతి […]

Read More

రేవంత్ రెడ్డి పై డీఎస్పీకి జోగు రామన్న ఫిర్యాదు

ఆదిలాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ, రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచి రాజ్యాంగపరమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి, రుణమాఫీ విషయంలో అబద్ధాలు చెబుతున్నారని, ఆయన వ్యాఖ్యలతో రైతులు ఆందోళనకు గురవుతున్నార ని, ఆ […]

Read More

బ్లాక్‌మార్కెట్ మాఫియా తాట తీయండి

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కలకలంగా మారిన ఎరువులు, పురుగుమందుల నకిలీ, కల్తీ, బ్లాక్‌మార్కెట్ మాఫియా తాటతీయాలని అధికారులను ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆదేశించారు. రైతులకు నష్టం జరిగే ఏ పనినీ ఈ ప్రభుత్వం సహించదు, చర్యలు చాలా కఠినంగా ఉంటాయనే సందేశం అందరికీ చేరాలన్నారు. అందుకోసం అవసరమైతే లైసెన్స్‌ల రద్దుతో పాటు క్రిమినల్ కేసులు పెట్టడానికి వెనకాడొద్దని, ఎలాంటి […]

Read More

విధుల పట్ల అలసత్యం వహిస్తే వేటు

– ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: పట్టణంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు మంగళవారం సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక మల్లమ్మ సెంటర్, స్టేషన్ రోడ్డు, సత్తెనపల్లి రోడ్డు, రావిపాడు నుండి ప్రధాన రహదారులు వెంబడి పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. మురికి నీరు చెత్తాచెదార్థం పేరుకుపోవడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు. కాలినడకన పలు సచివాలయాలకి చేరుకొని సిబ్బందితో మాట్లాడారు. వారి విధుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సచివాలయ […]

Read More

‘తెలుగు’ విశ్వవ్యాప్తికి ఆంధ్ర సారస్వత పరిషత్ కృషి

– గజల్ శ్రీనివాస్ గుంటూరు, మహానాడు: మూడో ప్రపంచ తెలుగు మహాసభల(2026) కు ముఖ్య సమన్వయకర్తగా గుంటూరు నగరానికి చెందిన ప్రముఖుడు పి.రామచంద్ర రాజుని నియమించినట్టు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ కేశిరాజు శ్రీనివాస్( గజల్ శ్రీనివాస్) తెలిపారు. నగరంలోని భారతీయ విద్యా భవన్ లో మంగళవారం నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన మాట్లాడారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షణే […]

Read More

ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో ప్రతి బాధితుడికి న్యాయం జరగాలి

– ఎమ్మెల్యే ప్రత్తిపాటి చిలకలూరిపేట, మహానాడు: ఐసీఐసీఐ బ్యాంకు కుంభకోణంలో నష్టపోయిన ప్రతిఒక్క బాధితుడికి న్యాయం జరగాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. మాజీ మేనేజర్, గోల్డ్ అప్రైజర్ కలిసి కోట్లాది రూపాయలకు మోసం చేస్తుంటే బ్యాంకు యంత్రాంగం కళ్లు మూసుకుందా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట చిలకలూరిపేట అనుకుంటే నరసరావుపేటలోనూ ఇదే తరహా మోసం వెలుగుచూడడం, అదే మేనేజర్ […]

Read More

వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు!

సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉండి శ్రమించారు • బాధితులకు రూ. 139.75 కోట్ల వరద సాయం పంపిణీ • సివిల్ సప్లయిస్ ద్వారా ఆదనంగా 63.60 కోట్ల విలువైన బియ్యం, సరుకుల పంపిణీ • మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 203. 3 కోట్లు వరద సాయంగా వ్యయం • ఈ వాస్తవాలు చూడని జగన్ రోతపత్రిక – వరదసాయం పేరుతో 534 కోట్లు మింగేశారంటూ తప్పడు రాతలు […]

Read More

రాష్ట్రం కోసం ఢిల్లీ నిధులు తెచ్చుకోలేని నేత జగన్‌!

– వైసీపీకి ప్రజా సంక్షేం పట్టదు – మాజీ సీఎంది పెద్ద క్రిమినల్ చరిత్ర – పోలవరం, అమరావతి పూర్తి చేస్తారని ప్రజలు ఊహించారు – సాక్షి వార్త పత్రిక కాదు… ఒక రోత పత్రిక, వైసీపీకి కరపత్రం – లైసెన్స్ ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ మంగళగిరి, మహానాడు: కటకటాల్లోకి వెళ్లకుండా చూసుకునేందుకు […]

Read More

హర్యానాలో మూడోసారి విజయం గొప్ప విషయమే…

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు విజయవాడ, మహానాడు: హర్యానాలో మూడోసారి విజయం సాధించటం అంటే మాములు విషయం కాదు. భిన్నమైన పాలన చేయటం బీజేపీకే సాధ్యం అయ్యింది. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఇదే విజయాన్ని కైవసం చేసుకుంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనే గెలుపునకు బాటలు వేసిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర […]

Read More

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి ప్లాన్‌!

– మజ్జి శ్రీనివాసరావు విమర్శ విజయనగరం, మహానాడు: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయి. నగరపాలక సంస్థ కమీషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) అన్నారు. ఈ మేరకు ఆయన జెడ్పీ చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు అనారోగ్యంతో […]

Read More