5న విచారణకు రండి…సజ్జలకు 41ఏ నోటీసులు

అమరావతి: కౌంటింగ్‌ రోజు అల్లర్లు చేయాలని సూచించిన కేసులో సజ్జలకు తాడేపల్లి పోలీసులు నోటీసులు పంపారు. నిబంధనలు పాటించే ఏజంట్లు అవసరం లేదని ఇటీవల వైసీపీ ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణలో ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ లీగల్‌ టీం వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. తాజాగా దానికి సంబంధించి తాడేపల్లి హెడ్‌ కానిస్టేబుల్‌ ద్వారా 5వ తేదీన విచారణకు రావాలని నోటీసులు పంపారు.

Read More

కౌంటింగ్‌ వేళ…పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు

-ఆయనపై తుళ్లూరు పీఎస్‌లో ఫిర్యాదు -ఇప్పటికే సజ్జలపై కేసు నమోదు -అధికారులను భయపెట్టేలా వ్యాఖ్యలు -గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌ లో పేర్ని నానిపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు అమరావతి: కౌంటింగ్‌ సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మొన్నటికి మొన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల కౌంటింగ్‌ ఏజెంట్లను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయగా నిన్నటి రోజున వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని అధికారులను […]

Read More

హైదరాబాద్‌ లో మాధవీలత గెలిచే అవకాశం: ఇండియా టుడే

హైదరాబాద్‌: దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో అనూహ్య ఫలితం వెలువడే అవకాశం ఉందని ఇండియా టుడే యాక్సిస్‌ మై టుడే తెలిపింది. ఎంఐఎం కంచుకోటలో ఈసారి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ, బీజేపీ అభ్యర్థి మాధవీలత మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు తెలిపింది. మాధవీలతనే గెలుపు వరించే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తంగా తెలంగాణలో బీజేపీకి 11-12 సీట్లు వచ్చే అవకాశం […]

Read More

కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు చేపట్టాలి

ప్రకాశం కలెక్టర్‌కు కూటమి నేతల వినతి ఒంగోలు: కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు ఒంగోలు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ ను కలసి వినతిపత్రం ఇచ్చారు. ఒంగోలు కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌, సంతనూతలపాడు విజయకుమార్‌ దర్శి గొట్టిపాటి లక్ష్మి,లలిత్‌ సాగర్‌లు కలెక్టర్‌ గారిని కలిసిన వారిలో ఉన్నారు. కౌంటింగ్‌లో వైసీపీ దౌర్జన్యాలు, దాడులకు తెగబడకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.

Read More

పెట్రోల్‌ బాంబుల ముడిసరుకు లభ్యం

సత్తెనపల్లి: రాజుపాలెం మండలం బ్రహ్మణపల్లిలో పెట్రోల్‌ బాంబుల ముడిసరుకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో భాగంగా గ్రామం లో పోలీసులు పరిశీలిస్తుండగా గడ్డి వాములో నిల్వచేసిన పెట్రోల్‌, 8 బీరు సీసాలు, 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

Read More

కూటమి తిరుగులేని విజయం సాధించబోతోంది

-ఎన్నికల్లో మూడు పార్టీల శ్రేణులు సమన్వయంతో పనిచేశారు -కౌంటింగ్‌ రోజున అల్లర్లకు పాల్పడేందుకు వైసీపీ ప్రణాళికలు రచిస్తోంది -పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలోనూ వైసీపీ కొర్రీలు వేయాలని చూసింది -డిక్లరేషన్‌ ఫాం తీసుకున్న తర్వాతే అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావాలి -కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో కాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు -కౌంటింగ్‌ ప్రక్రియలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై నేతలకు సూచన -కాన్ఫరెన్స్‌లో నేతలకు సూచనలు […]

Read More

నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్‌

-కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత -ఉన్నతాధికారుల కోసం ప్రత్యేక సెల్‌ -మానిటరింగ్‌ బృందాలతో నిరంతరం నిఘా అమరావతి : కౌంటింగ్‌ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలలో భాగంగా పలుచోట్ల రౌడీషీటర్లు, ట్రబుల్‌ మంగ్ల్‌ యాక్టివిటీస్‌ కలిగిన వారికి పోలీసుశాఖ తగు హెచ్చరికలు జారీ చేసింది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి లేకుండా పటిష్టమైన భద్రతా బలగాలను మోహరించారు. ఏ చిన్న సంఘటన చోటు చేసుకున్నా వెంటనే తదుపరి ఆదేశాలకు […]

Read More

ఆరా ఉందా…పుట్టి ముంచుతుందా..గట్టెక్కుతుందా?

-కూటమికి అనుకూలంగా అన్ని సర్వే సంస్థలు -అందుకు భిన్నంగా ఆరా మస్తాన్‌ సర్వే -ప్రామాణికతపై సర్వత్రా అనుమానాలు -మహిళల ఓట్లు, కాంగ్రెస్‌ ప్రభావంపై లాజిక్‌ మిస్సయ్యారా? -గుర్తింపు ఉన్న మంత్రులు ఓడితే ఎమ్మెల్యేలు ఎలా గెలుస్తారు? -టీడీపీ టికెట్‌ ఇవ్వలేదనే వ్యతిరేకంగా పనిచేశారా అంటూ నిలదీతలు -ఎగ్జిట్‌పోల్స్‌లో కొత్త తలనొప్పులు..మరో లగడపాటి అంటూ ట్రోలింగ్స్‌ -ఔరా..! ‘ఆరా’ సర్వేలో ఎన్ని సిత్రాలో… (వాసిరెడ్డి రవిచంద్ర) ఎగ్జిట్‌ పోల్స్‌ ఏపీలో కొత్త […]

Read More

జగన్‌కు ఆర్థిక రంగంలో ఒనమాలు కూడా రావు

-రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు -వచ్చే ఆదాయం… వడ్డీ కట్టడానికి సరిపోని దుస్థితి -రోజుకు రూ.90 కోట్లు వడ్డీ కడుతున్నాం -బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం సాగుతోంది -గాడిలో పెట్టడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద సమస్య -టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌ మంగళగిరి: జగన్‌కు ఆర్థిక రంగంలో ఓనమాలు కూడా రావని, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం […]

Read More

వైసీపీ గెలుపుపై సొంత పార్టీలోనే అనుమానాలు

– టీడీపీ గెలుస్తుందని వైసీపీ నేత పందెం పదిలక్షలు! – బెట్టింగులో రెండుగా చీలిపోయిన వైసీపీ నేతలు – టీడీపీ గెలుస్తుందని రాతపూర్వక పందెం – జగన్ ఓటమిని ముందే తేల్చేసిన పంచ్ ప్రభాకర్ – జగన్ ఓవర్ యాక్షన్ చేశారని ప్రభాకర్ ‘పంచ్’ – కార్యకర్తలను కలవలేదంటూ మరో పంచ్ – వైసీపీ కౌంటింగ్ ఏజెంట్లపై ఓటమి ప్రభావం ( మార్తి సుబ్రహ్మణ్యం) ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌కు మరో […]

Read More