హైదరాబాద్‌కు చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌, మహానాడు: విదేశీ పర్యటన ముగించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు పెదకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌, పలువురు నాయకులు స్వాగతం పలికారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.

Read More

పెళ్లిరోజు చావుకొచ్చింది..

-మండీ బిర్యానీ తిని ఎనిమిది మందికి అస్వస్థత -బిర్యానీ బిల్లు వెయ్యి అయితే…హాస్పిటల్‌ బిల్లు లక్ష (శివశంకర్‌ చలువాది) వండుకోవడానికి టైమ్‌ లేదనో..రుచికరమైన ఫుడ్‌ దొరుకుతుందనో బయట రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తిన్నారో.. ఇక అంతే సంగతులు అన్నట్టు తయారైంది పరిస్థితి. పరిశుభ్రతలేని కిచెన్‌లు, కల్తీ పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలు, కాలం చెల్లిన సరుకులతో తయారీ, ఇదీ ఇప్పుడు హోటల్స్‌లో పరిస్థితి. తాజాగా ఇలాంటి ఘటననే రంగారెడ్డి […]

Read More

జూన్‌ 2 నుంచి టోల్‌గేట్‌ చార్జీల మోత

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ టోల్‌ప్లాజాల వద్ద టోల్‌ రుసుములు జూన్‌ 2 నుంచి పెంచనున్నాయి. ఏటా ఏప్రిల్‌ 2న ఈ చార్జీలను పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని ఎన్‌హెచ్‌ఏఐని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్‌ 2 నుంచి టోల్‌ చార్జీలను సగటున 5 శాతం పెంచి వసూలు చేయనున్నారు.

Read More

సీఈవో గైడ్‌ లైన్స్‌ పై పేర్ని నాని అభ్యంతరం

అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో రాష్ట్రంలో లేని వెసులుబాటు ఈ రాష్ట్రం లో ఎందుకు ఇచ్చారు? అని వైసీపీ నేత పేర్ని నాని ప్రశ్నించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో లేని సడలింపులు ఏపీలో ఎందుకు ఇచ్చారు? ఒక పార్టీ కోరగానే ఇలాంటి గైడ్‌ లైన్స్‌ ఎలా ఇస్తారని నిలదీశారు. పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో ఎక్కడా లేని సర్క్యులర్‌ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్‌? ఈ నిర్ణయంపై పునరాలోచన చేయా లని కోరారు.

Read More

కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయట్లేదు?

-ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరం -బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ కుంభకోణాలు, నేరాల్లో మరో అతిపెద్దది ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం. ఇది దేశానికే మాయని మచ్చ. కేసీఆర్‌ కుటుంబం, వారి సన్నిహిత పోలీసు అధికారుల బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్నే కుదిపేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న […]

Read More

సజ్జల పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి

-వ్యవస్థలు ఎలా భ్రష్టుపట్టాయో మాచర్లే ఉదాహరణ -ప్రజల మద్దతుతో కూటమి అధికారంలోకి రాబోతోంది -వైసీపీ నేతలు ఏ కలుగులో దాక్కున్నా వదలం -చేసిన అరాచకాలకు మూల్యం చెల్లించక తప్పదు -మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళగిరి: సజ్జల రామకృష్ణారెడ్డి జూన్‌ 5న పెట్టాల్సిన ప్రెస్‌ మీట్‌ ఈరోజే పెట్టి బోరున విలపిస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ […]

Read More

వారణాసిలో ఈటెల బృందం ప్రచారం

వారణాసి, మహానాడు: తెలంగాణకు చెందిన ఈటల రాజేందర్‌ బృందం వారణాసిలో బీజేపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. బీజేపీఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే రామారావు పటేల్‌, చాడ సురేష్‌రెడ్డి, ధన్పాల్‌ సూర్యనారాయణ, తిరుపతి యాదవ్‌, గంగాధర్‌ గౌడ్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. సోనార్పూర్‌లో వారణాసి తెలుగు బ్రాహ్మణ సంఘం వారితో సమావేశమయ్యారు. మోదీకి ఓటు వేయాలని కోరారు.

Read More

జగన్‌ పై రాయి దాడి నిందితుడికి బెయిల్‌

అమరావతి: సీఎం జగన్‌పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కు షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తూ జిల్లా కోర్టు మంగళవరం తీర్పు చెప్పింది. పోలీసు విచారణకు సతీష్‌ సహకరించాలని పేర్కొంది. ఏప్రిల్‌ 13న బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ సెంట్రల్‌ నియోజక వర్గంలో పర్యటిస్తున్న సమయంలో జగన్‌పై రాయి దాడి చేశాడన్న కారణంతో ఏప్రిల్‌ 18న సతీష్‌ను అరెస్టు చేశారు.

Read More

పిన్నెల్లికి బెయిల్‌ మంజూరు

అమరావతి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు మంగళవారం వివిధ కేసులలో షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఆయన ప్రతిరోజూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆఫీస్‌లో రిపోర్టు చేయాలని సూచించింది. మాచర్ల వెళ్లకూడదని, నరసరావు పేటలో ఎక్కడ ఉంటారో పూర్తి చిరునామా, మొబైల్‌ నెంబర్‌ పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని పేర్కొంది. పాస్‌పోర్టు కోర్టులో సరెండర్‌ చేయాలని ఆదేశించింది.

Read More

వారం తర్వాత రాష్ట్రానికి పట్టిన టీడీపీ పీడ విరగడ ఖాయం

–  ఎన్నికల కమిషన్‌ అంపైర్‌ లాగా వ్యవహరించలేదు – చంద్రబాబు వైరస్‌తో ఎన్నికల కమిషన్‌ ఇన్‌ఫెక్ట్‌ అయింది – మాచర్ల విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరగడం లేదు – మా పార్టీకి అన్యాయం జరిగింది కాబట్టి రీ పోలింగ్‌ అడిగాం – వ్యవస్థలను మేనేజ్‌ చేసేందుకే కేంద్రంతో పొత్తులు – సీఎస్‌ జవహర్‌ రెడ్డిని తప్పించాలనే ప్రయత్నం చేస్తున్నారు – పదిరోజుల్లో వందల ఎకరాలు తీసుకోవడం సాధ్యమా…? – ఈవీఎంలలో […]

Read More