సిగ్గులేని బోత్సా…జగన్‌ కొత్త ట్రెండ్‌ తెచ్చాడా?

ఆయన పాలనతో మోదీ పాలనను పోల్చడం దివాలాకోరుతనం దళితులను చంపి బాబాయ్‌ను లేపేసి ట్రెండ్‌ సృష్టించారు సమస్త వనరులను లూటీ చేసి ట్రెండ్‌ సృష్టించారు అధికారులను తొత్తులుగా మార్చుకుని ట్రెండ్‌ సృష్టించారు సిండికేట్లతో కోట్లకు పడగెత్తి నువ్వుకూడా ట్రెండ్‌ సృష్టించావ్‌ బొత్స వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ ఫైర్‌ విజయవాడ, మహానాడు : పదేళ్ల పాలన చూసి ఓటు వేయమని మోదీ అడగలేదు…జగన్‌ తన పాలన చూసి ఓటు […]

Read More

మహిళా శక్తిపై రాహుల్‌ కుసంస్కారం

ఓటు బ్యాంకుగానే కాంగ్రెస్‌ రాజకీయాలు చేస్తోంది మహిళలంటే సోనియా, ఇందిర అన్న భావనలోనే ఉన్నారు వికసిత్‌ సంకల్ప్‌తో మోదీ వారి గౌరవం పెంచారు బీజేపీ ముఖ్యఅధికార ప్రతినిధి లంకా దినకర్‌ విజయవాడ, మహానాడు : మహిళలను అత్యున్నత శిఖరాలకు చేర్చాలన్న అభిమతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీదని, కాంగ్రెస్‌ పార్టీ అనాదిగా మహిళలను కేవలం ఓటు బ్యాంకుగానే చూసిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ శనివారం ఒక ప్రకటనలో […]

Read More

పల్నాడు జిల్లాలో భారీగా పోలీసులు

నరసరావుపేట, మహానాడు : ప్రస్తుతం పల్నాడు జిల్లాలో పోలీసు ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎన్నికల అనంతరం జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసు శాఖ హై అలర్ట్‌ ప్రకటించింది. ఇప్పటికే గ్రామ గ్రామాన కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. అనుమా నిత వ్యక్తులను అదుపులోకి తీసుకుంటున్నారు. పలు గ్రామాల్లో మారణాయు ధాలపై గురిపెట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కౌంటింగ్‌ ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు.

Read More

గుడివాడలో మాయలేడి…కోటిన్నరకు టోకరా

రుణాలు ఇప్పిస్తానంటూ మాయమాటలతో మోసం పోలీసుస్టేషన్‌లో బాధితుల ఫిర్యాదు గుడివాడ, మహానాడు : కృష్ణా జిల్లా గుడివాడలో అమాయకులకు మాయమాటలు చెప్పి కోటిన్నర కాజేసిన మాయలేడి పరారైన ఘటన వెలుగుచూసింది. మాయ లేడి లీలావతిపై చర్యలు తీసుకుని తమను ఆదుకోవాలంటూ బాధితులు రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్‌ సంస్థల్లో రుణాలు ఇప్పి స్తానంటూ లీలావతి అనేక మందిని నమ్మించింది. లక్ష్మీ నగర్‌ కాలనీ, బాపూజీ […]

Read More

అర్ధరాత్రి దాటాక హైకోర్టు విధులు

350కి పైగా కేసుల విచారణ ముగ్గురు న్యాయమూర్తుల రికార్డ్‌ హైదరాబాద్‌: వేసవి సెలవుల సందర్భంగా తెలంగాణ హైకోర్టు గురువారం అర్ధరాత్రి దాటాక కూడా పనిచేసి చరిత్ర సృష్టించింది. సెలవుల కారణంగా ఫైలింగ్‌తో పాటు లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ల సంఖ్య ఎక్కువగా ఉండటంతో వాటన్నింటిపై విచారించడానికి అర్ధరాత్రి దాటింది. జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి అర్ధరాత్రి సుమారు ఒంటిగంట వరకు బెంచ్‌పై కేసులు విచారిస్తూనే ఉన్నారు. అంతకుముందు జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో […]

Read More

చార్‌ధామ్‌ యాత్రలో 52 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ : ఈ నెల 15 నుంచి ప్రారంభమైన చార్‌ధామ్‌ యాత్రలో ఇప్పటి వరకు 50 మందికి పైగా భక్తులు మృతిచెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్‌ కమిషనర్‌ వినయ్‌శంకర్‌ తెలిపారు. ముగ్గురు గంగోత్రిలో, 12 మంది యమునోత్రిలో, నలుగురు బద్రీనాథ్‌, 23 మంది కేదార్‌నాథ్‌లో మరణించారని వివరించారు. 50 ఏళ్లు దాటిన యాత్రికులకు వైద్య పరీక్షలు తప్పనిసరి […]

Read More

ఏపీకి ‘రెమాల్‌’ తుఫాన్‌ హెచ్చరిక

అమరావతి: నైరుతి పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారి ఆ తర్వాత ఈశాన్యంగా పయనించి శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళా ఖాతంలో తుఫాన్‌గా మారనుంది. దీనికి ‘రెమాల్‌’ అని పేరు పెట్టారు. ఈ తుఫాన్‌ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో ఏపీలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని, […]

Read More

పిన్నెల్లిపై హత్యాయత్నం కేసు నమోదు

అమరావతి :  మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయ త్నం కేసు నమోదైంది. ఈనెల 13న పాల్వాయి గేటులోని పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్నందుకు తనపై పిన్నెల్లి దాడి చేశాడని టీడీపీ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెంటచింతల పోలీసులు 307 సెక్షన్‌ కింద హత్యాయత్నం కేసు నమోదు నమోదు చేశారు.

Read More

సూర్య ప్రజంట్స్‌ “మెయ్యళగన్”

హీరో కార్తీ తన 27వ చిత్రం కోసం తన సోదరుడు, హీరో సూర్య కొలాబరేషన్ లో ’96’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక, సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘కార్తీ 27’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం టైటిల్‌ను, […]

Read More

బాలయ్య చేతుల మీదుగా “సత్యభామ” ట్రైలర్

‘క్వీన్ ఆఫ్ మాసెస్’ కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “సత్యభామ”. నవీన్ చంద్ర అమరేందర్ అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు. “మేజర్” చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు. జూన్ 7న “సత్యభామ” సినిమా గ్రాండ్ […]

Read More