విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని కేంద్ర సహాయమంత్రి తెలంగాణకు చెందిన బండి సంజయ్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఈవో స్వాగతం పలికారు. ఏపీకి చెందిన మంత్రి కందుల దుర్గేష్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఈవో స్వాగతం పలికారు. వేదపండితులు, అర్చ కులు ఆశీర్వచనం చేశారు. ఈవో అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రాలు, చిత్రపటం అందజేశారు.
Read Moreకనకదుర్గమ్మను దర్శించుకున్న పన్నీర్ సెల్వం
విజయవాడ: ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం బుధవారం దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో కార్యనిర్వాహణాధికారి కె.ఎస్.రామారావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దుర్గమ్మ దర్శనం కల్పించారు. అనంతరం వీరికి వేదపండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఈవో అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, చిత్రపటం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాశస్త్యతను వివరించారు.
Read Moreనేడు సీఎంగా చంద్రబాబు బాధ్యతలు
సాయంత్రం 4.41 గంటలకు ముహూర్తం అనంతరం ఐదు ఫైళ్లపై సంతకాలు తొలి సంతకం మెగా డీఎస్సీ రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ రద్దు మూడో సంతకం రూ.4 వేలకు పింఛన్ పెంపు నాలుగో సంతకం అన్న క్యాంటిన్ల పునరుద్ధరణ ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ అమరావతి: ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం 4:41 నిమిషాలను ఏపీ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే సమయంలో హామీల అమలుకు […]
Read Moreఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్‌చరణ్ మారీ
హాజరైన ప్రధాని మోదీ, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఆహ్వానాన్ని మన్నించి పాల్గొన్న ప్రతిపక్ష నేత నవీన్‌పట్నాయక్ భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ గిరిజన నేత మోహన్ చరణ్ మారీ బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఇతర ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. […]
Read Moreబాబు ప్రమాణ స్వీకారం వేళ…ఏపీకి గుడ్‌న్యూస్
రూ.50 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ ప్రాజెక్టు మూడు రాష్ట్రాలను పరిశీలిస్తున్న కేంద్ర సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో సానుకూల అంశాలపై పరిశీలన ప్రముఖ పత్రికలో కథనంపై నిరుద్యోగుల్లో ఆశలు అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వేళ రాష్ట్రానికి శుభవార్త అందుతోంది. రాష్ట్రంలో భారీ రిఫైనరీ ప్రాజెక్టు ప్రారంభానికి బీపీసీఎల్ పరిశీలి స్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏడాదికి 12 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న రిఫైనరీ నెలకొల్పాలని బీపీసీఎల్ భావిస్తోందని, […]
Read Moreఉత్తరాదిలో భగ్గుమంటున్న భానుడు
ప్రయాగ్‌రాజ్‌లో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఢిల్లీ: ఉత్తరాది రాష్ట్రాలు ఎండలతో మండి పోతున్నాయి.. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. భానుడు భగ్గున మండిపోతున్నాడు. సగటున 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అత్యధికంగా 47.1 డిగ్రీ ల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 17 వరకు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం కొనసాగనున్నట్లు అధికారులు వెల్లడిరచారు.
Read Moreసామాజిక సమతూకం, యువతరానికి పెద్దపీట
చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనం మంత్రివర్గ కూర్పుపై ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు వినుకొండ: అన్నివర్గాలకు న్యాయం చేస్తూ సామాజిక సమతూకం పాటిస్తూ యువతరానికి పెద్దపీట వేసిన మంత్రివర్గ కూర్పు అద్భుతంగా కుదిరిందని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. కూటమి మంత్రివర్గంలో ఏకంగా 17 మంది కొత్తవారికి అవకాశం కల్పించడాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టికి నిదర్శనంగా అభివర్ణిం చా రు. అన్నిప్రాంతాలు, అన్ని జిల్లాలు, అన్ని వర్గాలకు ప్రాధాన్యం లభించేలా […]
Read Moreసాగునీటి ప్రాజెక్టుల పూర్తికి క్యాలెండర్ రూపొందించండి
ఆగిన చిన్నతరహా ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు భూములు గుర్తించండి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆదేశం ఖమ్మంలో విద్య, సాగునీటి రంగాలపై సమీక్ష విదేశీ విద్య స్కాలర్‌షిప్‌లు మరో వంద పెంచనున్నట్లు వెల్లడి ఖమ్మం: కలెక్టర్ కార్యాలయంలో విద్య, సాగునీటి పారుదల శాఖల ప్రగతిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బుధవారం సమీక్ష నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురామిరెడ్డి, జిల్లా […]
Read Moreకువైట్ లో భారీ అగ్నిప్రమాదం.. 41మందికి పైగా మృతి
కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ఎత్తైన భవనంలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు భారతీయులతో సహా 41 మంది సజీవదహనమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కువైట్‌లోని దక్షిణ మంగాఫ్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. 41 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలోని కువైట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో భవనంలో మంటలు వ్యాపించాయి. మంటలు […]
Read Moreపార్టీ కార్యాలయంలో మంత్రి సత్యకుమార్‌కు ఘన స్వాగతం
బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం లో రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బిజెపి జాతీయ కార్యదర్శి,, ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వై సత్య కుమార్ కు రాష్ట్ర కార్యాలయం లో ఘన స్వాగతం పలికారు. అనంతరం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అద్యక్షతన జరిగిన సమావేశంలో ఘనంగా సన్మానించారు. బిజెపి ఎమ్మెల్యే లు సైతం సత్య కుమార్ ను శాలువా లతో సత్కరించారు. ఈ సందర్భంగా […]
Read More