గుంటూరులో 14 ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు

-జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి రాష్ట్ర ముఖ్య మంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రజలు తిలకించటానికి గుంటూరు నగరంలో 14 ప్రాంతాల్లో ఎస్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని జీఎంసీ కమిషనర్ కీర్తి చేకూరి మంగళవారం తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, మాయాబజార్ సెంటర్, డొంక రోడ్, నాజ్ సెంటర్, ఏటుకూరు రోడ్డు కన్యకా పరమేశ్వరి అమ్మ గుడి వద్ద తదితర ప్రాంతాల్లో స్క్రీన్లు ఏర్పాటు […]

Read More

‘హరోం హర’ న్యూ ఏజ్ కమర్షియల్ యాక్షన్, క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్ గా వుంటుంది: డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారక

హీరో సుధీర్ బాబు మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘హరోం హర’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు గ్రాండ్‌గా నిర్మించిన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌కి సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి. టీజర్, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ హైప్ క్రియేట్ చేశాయి. జూన్ 14న హరోం హర గ్రాండ్ గా […]

Read More

గుంటూరు నుంచి వాహనాల మళ్లింపు

ప్రమాణస్వీకారం సందర్భంగా ఆంక్షలు ఎస్పీ తుషార్‌ డూండి వెల్లడి గుంటూరు: గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్కు వద్ద ప్రాంగణంలో చంద్రబాబు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోదీ హాజరుకానున్న నేపథ్యంలో గుంటూరు జిల్లా నుంచి విశాఖపట్నం వెళ్లే ప్రయాణికులు, ఇతర వాహన దారులకు ఇబ్బందులు తలెత్తకుండా గుంటూరు పట్టణం నుంచి, గుంటూరు జిల్లా పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు ఏర్పాట్ల గురించి ఎస్పీ తుషార్‌ డూండి వెల్లడిర చారు. ప్రమాణస్వీకారం పూర్తయ్యే వరకు […]

Read More

రవితేజ 75వ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ ఎందరో ఔత్సాహిక దర్శకులకు, నటీనటులకు స్ఫూర్తి. తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్, మాస్ యాటిట్యూడ్, విలక్షణమైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. స్వయంకృషితో స్టార్ గా ఎదిగిన రవితేజ, యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటారు. అలా యువ దర్శకులతో పని చేసి పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను, గుర్తుండిపోయే పాత్రలను అందించారు. తెలుగు చిత్రసీమలో అత్యంత విజయవంతమైన నిర్మాణ సంస్థల్లో […]

Read More

కేంద్రమంత్రులను కలిసిన పెమ్మసాని

-కమ్యూనికేషన్‌, గ్రామీణాభివృద్ధి మంత్రులతో భేటీ -నేడు సహాయ మంత్రిగా బాధ్యతల స్వీకరించనున్నట్లు వెల్లడి ఢిల్లీ: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన అనంతరం కేంద్ర సహాయ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకోనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్‌, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం.సింధియాను ఢిల్లీలో […]

Read More

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై నివేదిక

అమరావతి: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు సంబంధించి ఆర్టీసీ అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అందుకోసం తెలంగాణ, కర్ణాటకలో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించారు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో అమలు చేయనున్నారు. అయితే కొత్త జిల్లాల పరిధిలోపే పరిమితి ఉంటుందా? ఉమ్మడి జిల్లాల పరిధిలోపు ప్రయాణానికి అనుమతిస్తారా? లేక లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? అన్నది ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించనుంది. దీనిపైన చంద్రబాబు ప్రమాణస్వీకారం […]

Read More

తుంగభద్రకు భారీగా వరద నీరు

1580.23 అడుగులకు నీటి మట్టం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సాగునీరందిస్తోన్న తుంగభద్రకు భారీగా వరద చేరుతోంది. జలాశయం ఎగువ ప్రాంతాలైన అగుంబె, వర్నాడు, ఖుదరేముఖ తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో తుంగ, భద్ర నదులకు అధిక స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 1580.23 అడుగులకు చేరుకుంది. 4,817 క్యూసెక్కుల వరద నీరు వచ్చిచేరుతోందని, ప్రస్తుతం జలాశయంలో 4.58 టీఎంసీల వరద నీరు నిల్వ […]

Read More

పార్టీ కార్యకర్తకు చంద్రబాబు ఆహ్వానం

అమరావతి: సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలపై పోరాడిన పుంగనూరుకు చెందిన పార్టీ కార్యకర్త అంజిరెడ్డిని ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు ఆహ్వానిం చినట్లు టీడీపీ వెల్లడిరచింది. అందుకు సంబంధించి అంజిరెడ్డి మాట్లాడిన వీడియోను పార్టీ శ్రేణులు ట్రెండ్‌ చేస్తున్నాయి. వీడియోలో అంజిరెడ్డి మాట్లాడు తూ ‘చంద్రబాబు ఆహ్వానాన్ని స్వాగతిస్తున్నా..సంతోషిస్తున్నా. బుధవారం విజయవాడ వస్తున్నా. ఎన్డీఏ పాలన బాగుండాలని ఆకాంక్షిస్తున్నా. ప్రజలను తన బిడ్డల్లా కాపాడుకునే శక్తి బాబుకే ఉంది’ అంటూ సందేశమిచ్చారు.

Read More

అంకితభావంతో ప్రజల మన్ననలు పొందండి

క్షేత్రస్థాయిలో అధ్యయనంతో పరిష్కార మార్గం ట్రైనీ ఐఏఎస్‌లతో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హైదరాబాద్‌: వృత్తిలో అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలను పొందాలని శిక్షణలో ఉన్న 2023 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారులు కలిశారు. డైరెక్టర్‌ జనరల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ శశాంక్‌ గోయల్‌ వారిని పరిచయం చేశారు. శిక్షణలో ఉన్న […]

Read More

జగన్‌కు చంద్రబాబు ఫోన్‌

అమరావతి: ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి రావాలని వైసీపీ అధినేత జగన్‌ను ఆహ్వానించేందుకు చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉండాలని వైసీపీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Read More