ప్రభుత్వం ఏర్పాటు చేయండి బాబూ: గవర్నర్‌ పిలుపు

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీఎ కూటమి నేత చంద్రబాబునాయుడిను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబి తాను గవర్నర్‌కు అందజేశారు. అలాగే మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్‌తో చర్చించారు. ఇక బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో […]

Read More

ఇసుక, గనుల తవ్వకాలకు టెండర్లు పిలవాలి

తక్షణమే వార్షిక క్యాలెండర్‌ రూపొందించాలి ఆదాయం పెంపునకు మార్గాలు అన్వేషించాలి నది తీరాల్లో తవ్వకాలపై నివేదిక సిద్ధం చేయాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశం హైదరాబాద్‌: ఇసుక, వివిధ గనుల తవ్వకాలకు సంబంధించి వార్షిక క్యాలెండర్‌ రూపొందించి వెనువెంటనే టెండర్లు పిలవాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం ఆయన సచివాలయంలో గనుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత రెండు ఆర్థిక సంవత్సరాలుగా గనుల […]

Read More

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి పాసుల గోస

-పరిమితంగానే వీవీఐపీల పాస్లు -పార్టీ నేతలకూ దొరకని పాసులు -ఐటిడిపికీ దొరకని పాసులు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, సీఎం లు హాజరు కానున్నారు. అందుకు తగ్గట్టుగానే అధికారులు వీఐపీలు, వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, అటు అభిమానులు సైతం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి ఉవ్విళ్లూరుతున్నారు. సామాన్య కార్యకర్తలు […]

Read More

విజయం నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి

సుపరిపాలన అందించేందుకు దృష్టిపెట్టాలి సబ్‌కా సాత్‌..సబ్‌ కా వికాస్‌ లక్ష్యంతో పనిచేయాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: నగరంలోని ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఎన్డీఏ ఎమ్మెల్యేల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబును బలపరిచన అనంతరం ప్రసంగిస్తూ అనూహ్యమైన విజయాన్ని సాధించాం. గడిచిన ఐదు సంవత్సరాలలో ప్రజలు అనేక ఓడి దుడుకులు ఎదుర్కొన్నారు. ఒక విధ్వంస పాలనతో ఇబ్బందులకు గురయ్యారు. ప్రజా […]

Read More

రేవంత్.. ఆ హామీల సంగతేంటి?

-ఆరు నెలలైనా హామీలు అమలేదీ సీఎం గారూ? -లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను తిరస్కరించారు -త‌క్ష‌ణ‌మే హామీల అమ‌లుపై స్పష్టమైన ప్రకటన చేయాలి -రుణమాఫీకి డేట్ ఇచ్చినట్లే మిగతా హామీలకు డేట్స్ ఇవ్వాలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏలేటి మరో బహిరంగ లేఖ సిఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆరు నెల‌లైంది…. లోక‌స‌భ ఎన్నిక‌ల కోడ్ కూడా ముగిసింది … ఇక‌నైనా సాకులు మాని, మీరు […]

Read More

నగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతాం

అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేదు లేదు ఇంకా అధికారం భ్రమలోనే వైసీపీ కార్పొరేటర్లు బానిసలుగా ఉండటానికి అధికారులకు సిగ్గులేదా? వారి మాటలు వింటే శ్రీకృష్ణజన్మస్థానం తప్పదు గుంటూరు జిల్లా జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి గుంటూరు: నగరపాలక సంస్థ అవినీతిపై ఏసీబీ విచారణ కోరతామని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి తెలిపారు. అవినీతికి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలే ప్రసక్తి లేదని స్పష్టం […]

Read More

పర్వత శ్రేణుల్లో కుప్పకూలిన విమానం

విమాన ప్రమాదంలో మలావీ ఉపాధ్యక్షుడు మృతి ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా విమాన ప్రమాదంలో మరణించినట్లు ఆ దేశ అధ్యక్షుడు లజరాస్ చెఖ్వీరా టీవీ ప్రకటనలో తెలిపారు. పర్వత శ్రేణుల్లో విమానం కుప్పకూలినట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఆయనతో పాటు మరో 9 మంది మరణించినట్లు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఇరాన్ అధ్యక్షుడు రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన […]

Read More

తలసాని సోదరుడు శంకర్‌యాదవ్‌కు కన్నీటి వీడ్కోలు

అంతిమయాత్రకు తరలివచ్చిన పార్టీల నేతలు, అభిమానులు అన్న భౌతికకాయాన్ని చూసి శ్రీనివాసయాదవ్‌ కన్నీరు హైదరాబాద్‌: మాజీమంత్రి, సనత్‌ నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు, మోండా మార్కెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు తలసాని శంకర్‌ యాదవ్‌ అంత్యక్రియలు మంగళవారం వేలాదిమంది సమక్షంలో జరిగాయి. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజా మున మరణించగా మంగళవారం కుటుంబసభ్యులు బన్సీలాల్‌పేటలోని గ్రేవ్‌ యార్డ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నీ […]

Read More

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి చిరంజీవి, రజనీకాంత్

ఏపీ సీఎంగా చంద్రబాబు రేపు ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరుకానున్నారు. ఆయన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా రావాలని చంద్రబాబు కోరారు. మరోవైపు టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి కూడా విశిష్ట అతిథిగా రానున్నారు.

Read More

ఏపీ అసెంబ్లీ సమావేశాలు 17 నుంచి

ఈనెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏకాదశి కావడంతో ఆ రోజు మంచిదని కొత్త ప్రభుత్వానికి పలువురు పండితులు సూచించినట్లు సమాచారం. 4 రోజుల పాటు కొనసాగే మొదటి సెషన్‌లో తొలిరోజుఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండోరోజు స్పీకర్ ఎన్నిక ఉండనుంది. ఇక ఈ సెషన్‌లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం ఆమోదించనున్నట్లు తెలుస్తోంది.

Read More