రాజస్థాన్: సంజనా జాతవ్ (25) దళిత వర్గానికి చెందిన మహిళ. రాజస్థాన్‌లోని భరత్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి 51,983 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రాం స్వరూప్ కోలీపై విజయం సాధించారు. 18వ లోక్‌సభకు ఎన్నికైన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. 2019లో మహారాజా సూరజ్మల్ బ్రిజ్ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన జాతవ్ ఈ ఎన్నికల్లో రాజకీయ ప్రవేశం చేశారు.
Read Moreసీఎం రేవంత్‌ను కలిసిన సీపీఐ బృందం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని బుధవారం సీపీఐ ప్రతినిధులు కలిశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం జరిగినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలను మిత్రపక్షాల మద్దతుతో గెలిచిన సందర్భంగా అభినందనలు తెలిపారు. కలిసిన వారిలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ […]
Read Moreఇప్పటంలో వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
తాడేపల్లి: ఇప్పటం గ్రామంలో వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఇక్కడ నాలుగు విగ్రహాలు ఉండగా రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని మాత్రమే ధ్వంసం చేసి శిలాఫలకాన్ని పగులగొట్టారు.
Read Moreవేధించిన ఎస్పీ జాషువా గెస్ట్‌హౌస్‌కు పట్టాభిరామ్
సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ చేసి అదృశ్యం పుష్పగుచ్చం, శాలువా ఉంచి వీడియో సందేశం విజయవాడ: గత ఏడాది ఫిబ్రవరి 20న కృష్ణా జిల్లా తోట్లవల్లూరు పోలీసుస్టేషన ్‌లో ఒక అక్రమ కేసులో తనను నిర్బంధించి స్టేషన్‌లో అర్ధరాత్రి కరెంటు తీసేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించి రాచమర్యాదలు చేసిన అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా ను బుధవారం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట […]
Read Moreదగ్గుబాటి పురంధేశ్వరికి బీజేపీ నేతల అభినందన
రాజమండ్రి: ఎంపీగా గెలుపొందిన దగ్గుబాటి పురంధేశ్వరిని బుధవారం ఆమె నివాసంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాళ్ల దొరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకటసుబ్బారావు, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జ్ కర్రి చిట్టిబాబు కలిసి అభినందనలు తెలిపారు. వారితో పాటు ఈతకోట బాలస్వామి, పార్టీ అల్లవరం మండల అధ్యక్షుడు సుంకర సాయి, అమలాపురం రూరల్ ప్రధాన కార్యదర్శి డేగల వెంకటరమణ, బీజేపీ జిల్లా నాయకులు, మాజీ వైస్ ప్రెసిడెంట్ అడపా శ్రీను, […]
Read Moreగెలుపోటములు సహజం..సంయమనం పాటించండి
చిన్నపాటి గొడవలు జరిగినా కఠినంగా వ్యవహరిస్తాం కలెక్టర్‌తో మాట్లాడి 144 సెక్షన్ సడలిస్తాం పల్నాడు ఎస్పీ మల్లికాగార్గ్ చిలకలూరిపేట: పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్ బుధవారం యడ్లపాడు పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడు తూ పల్నాడు జిల్లాలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకుని కొంతమందిపై రౌడీ షీట్లు ఓపెన్ చేశామని తెలిపారు. కొంత మందిని బైండోవర్ చేసినట్లు పేర్కొన్నారు. […]
Read Moreజి.వి.ఆంజనేయులుకు అభినందనల వెల్లువ
నివాసానికి తరలివచ్చిన నేతలు, అభిమానులు వినుకొండ పార్టీ కార్యాలయంలో సందడి వినుకొండ: కూటమి ప్రభంజనంలో అపూర్వ విజయం అందుకున్న తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యేగా గెలుపొందిన జీవీ ఆంజనేయులుకు అభిమాన గణం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం నాటి ఫలితాల్లో ప్రత్యర్థుల అంచనాలకు కూడా అందని రీతిలో 30,267 ఆధిక్యంతో ఆయన గెలుపొందారు. దాంతో జీవీ ఇంటికి, పార్టీ కార్యాలయానికి బుధవారం పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, […]
Read Moreకొలువుదీరనున్న కొత్త అసెంబ్లీ
_ టీడీపీ 135 స్థానాలు _ జనసేన పార్టీ 21 స్థానాలు _ వైఎఎస్‌ఆర్‌సీపీ 11 చోట్ల గెలుపు _ బీజేపీ 8 స్థానాలు కైవసం మే 13న ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ జరిగింది. వైసీపీ 175 సీట్లలో పోటీ చేయగా.. ఎన్డీయే కూటమిలోని తెలుగుదేశం పార్టీ 144, జనసేన 21, బీజేపీ 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేశాయి. మరో కూటమి ‘ఇండియా’లో భాగంగా కాంగ్రెస్ పార్టీ 159 సీట్లు, […]
Read Moreసజ్జలపై మాజీ మంత్రి డొక్కా సంచలన వ్యాఖ్యలు
నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది..విచారణ జరిపించాలి కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టారు ఓటర్లు సరైన సమయంలో బుద్ధిచెప్పారని వెల్లడి గుంటూరు: మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్‌ను ట్యాప్ చేయిం చారని, దీనిపై విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. బుధవారం గుం టూరులోని జన చైతన్య వేదిక హాలులో ఎన్నికల ఫలితాల విశ్లేషణపై జనచైతన్య వేదిక […]
Read Moreచంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
అమరావతి : ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యువనేత నారా లోకేష్ ఆదేశానుసారం హైదరాబాద్‌కు చెందిన ఆర్‌కే ఈవెంట్స్ ప్రతినిధులు అమరావతి రాజధాని ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు చేసే నిమిత్తం 15 లారీలలో మెటీరియల్‌ను తీసుకొ చ్చారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే స్థలాన్ని ఎంపిక చేయాల్సి ఉంది.
Read More