తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమలత

తిరుపతి: తిరుమల వెంకటేశ్వర స్వామిని సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీజేపీ నాయకురాలు, సినీ నటి సుమలత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండి తులు ఆశీర్వాదం అందజేశారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మా కొడుకు పెళ్లి అయిన తర్వాత మొదటిసారి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీత […]

Read More

పల్నాడులో కౌంటింగ్‌కు వేళాయె…

పోలీసు యంత్రాంగం అప్రమత్తం ఎక్కడికక్కడ కఠిన ఆంక్షలు 144 సెక్షన్‌ అమలు చేస్తూ ముమ్మర నిఘా చిలకలూరిపేట నుంచి తొలి ఫలితం గురజాల నుంచి తుది ఫలితాలు పల్నాడు జిల్లా: పోలింగ్‌ రోజున అల్లర్లతో దేశవ్యాప్తంగా అపఖ్యాతిని మూటగట్టు కున్న పల్నాడు జిల్లాలో ఓట్ల లెక్కింపు వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధాన రాజకీయపక్షాల కార్యాలయాలు, అభ్యర్థుల ఇళ్ల వద్ద శనివారం నుంచే బలగాలను […]

Read More

ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌

మధ్యాహ్నానికి తొలి ఫలితం తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌, తర్వాత ఈవీఎం ఓట్లు రాష్ట్రవ్యాప్తంగా 119 మంది అబ్జర్వర్ల నియామకం 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్‌ హాళ్ల ఏర్పాటు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా అమరావతి: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ మరికొద్ది గంటల్లో మొదలు కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా సోమవా రం కీలక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు […]

Read More

ఓటింగ్‌లో భారత్‌ ప్రపంచ రికార్డ్‌

ఏడు విడతల పోలింగ్‌ ప్రశాంతం కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ ఢిల్లీ: పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్‌కుమార్‌ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఏడు విడతలుగా పోలింగ్‌ విజయవంతంగా జరిగిందని, ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డ్‌ అని పేర్కొన్నారు. మన దేశంలో ఓటేసిన వారి సంఖ్య జీ7 దేశాల జనాభాకు 1.5 రెట్లు, యూరోపియన్‌ యూనియన్‌ జనాభాకు 2.5 […]

Read More

తొలిసారి ఓడిన సిక్కిం మాజీ సీఎం చామ్లింగ్‌

సిక్కిం: సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రతిపక్ష ఎస్డీఎఫ్‌ పార్టీ ఘోర పరాజ యం పాలైంది. ఒక్క సీటుకే పరిమితమైన ఈ పార్టీ 2019తో పోలిస్తే 14 సీట్లను కోల్పోయింది. తాజా ఫలితాల్లో ఆ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ 39 ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఓటమి చవిచూశారు. ఆయన పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోవడం గమనార్హం. 1985 నుంచి వరుసగా 8 సార్లు […]

Read More

సీఎం రేవంత్‌ను కలిసిన సివిల్స్‌ ర్యాంకర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సోమవారం సివిల్స్‌-2023 ఆల్‌ ఇండియా 27వ ర్యాంకర్‌ సాయికిరణ్‌ నందాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి అభినందించారు. సాయికిరణ్‌ ది కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెల్చాల గ్రామం.

Read More

ఎన్టీఆర్ ఫౌండేషన్ కు మన్నవ మోహన్ కృష్ణ విరాళం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చెక్కు అందజేత అమరావతి :- ఎన్టీఆర్ ట్రస్ట్ అనుబంధ విభాగమైన ఎన్టీఆర్ ఫౌండేషన్ కు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ రూ.2 కోట్లను విరాళంగా అందించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును సోమవారం ఉండవల్లి నివాసంలో కలిసి చెక్కు అందించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ఎంతో మంది పేద విద్యార్థులను ట్రస్టు ద్వారా చదివిస్తున్నారన్నారని […]

Read More

కౌంటింగ్‌పై ఎంపీ అభ్యర్థులకు రేవంత్‌రెడ్డి సూచనలు

-నిర్లక్ష్యం వద్దు…అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి -నిబద్ధత ఉన్న వారినే ఏజెంట్‌గా పంపాలి -ఈవీఎం, 17సీ ఓట్లకు తేడా వస్తే ఫిర్యాదు చేయాలి హైదరాబాద్‌: పార్లమెంట్‌ అభ్యర్థులు, ఇన్‌చార్జ్‌ మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోమవారం జూమ్‌ సమావేశంలో సమీక్షించారు. ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ దీపాదాస్‌ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

Read More

93 ఏళ్ల వయసులో ఐదో వివాహం

ఆస్ట్రేలియన్‌- అమెరికన్‌ బిలియనీర్‌, మీడియా టైకూన్‌గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్‌ మర్దోక్‌ 93 ఏళ్ల వయసులో ఐదో పెళ్లి చేసుకుని ఆశ్చర్య పరిచాడు. తనకంటే వయసులో 26 ఏళ్ల్ల చిన్న అయిన రిటైర్డ్‌ జీవ శాస్త్రవేత్త ఎలీనా జుకోవాను (67) వివాహమాడారు. కాలిఫోర్నియాలోని సొంత ఎస్టేట్‌లో వీరి వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగింది. గత ఏడాదిగా వీరు డేటింగ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.

Read More

కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు

-రేవంత్‌ పాలనలో తెలంగాణ పదం మాయమైంది -ప్రకటనల్లో ఎక్కడా జై తెలంగాణ నినాదం లేదు -సీఎం కావొచ్చు… కానీ ఉద్యమకారుడు కాలేడు -ప్రజల కలలను నిజం చేసిన పార్టీ బీఆర్‌ఎస్‌ -తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో మాజీ మంత్రి హరీష్‌రావు సిద్దిపేట: బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే […]

Read More